నకిలీ ఎన్ వోసీలతో 22ఏ వివాదాలు
Actor ProfilePolitician

నకిలీ ఎన్ వోసీలతో 22ఏ వివాదాలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నకిలీ ఎన్ వోసీలతో 22ఏ వివాదాలు
Andhra Jyothy23 Nov 2026
నకిలీ ఎన్ వోసీలతో 22ఏ వివాదాలు

తహసీల్దార్‌ నుంచి కలెక్టర్‌ దాకా గతంలో ఎన్‌వోసీలు జారీ చేసిన అధికారులు రికార్డుల్లో కనిపించని ఆ వివరాలు ఫోర్జరీ సంతకాలతోనూ ఎన్వోసీలు ప్రస్తుతం నిషేధిత జాబితాలోకి భూములు.. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న బాధితులు గత ప్రభుత్వ హయాంలో ఎక్కువగా ఈ తరహా ఎన్‌వోసీలు హైదరాబాద్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నిషేధిత భూముల జాబితా (22ఏ)పై నెలకొన్న వివాదానికి నకిలీ ఎన్‌వోసీల వ్యవహారం కూడా సమస్యగా మారింది. గతంలో భూముల రిజిస్ట్రేషన్‌కు అనుమతించాలంటూ అధికారులు జారీ చేసిన నిరభ్యంతర పత్రాలు (ఎన్‌వోసీలు) రికార్డుల్లో ఉండకపోవడంతో.. ఆ భూములను ప్రస్తుతం నిషేధిత జాబితాలో చేర్చారు. అయితే అప్పట్లో ఎన్‌వోసీలు పొందిన బాధితులు మాత్రం వాటినే పట్టుకుని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో ఏవి నిజమైన ఎన్‌వోసీలో, ఏవి నకిలీవో తెలియక అధికారులు తలపట్టుకుంటున్నారు. ఉదాహరణకు.. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా, మేడ్చల్‌ మండలం దబీర్‌పూర్‌ గ్రామంలో సర్వే నంబరు 67/ఏ, 67/ఏఏ పరిధిలో 10 ఎకరాల భూమిని 22ఏ జాబితా నుంచి తొలగించాలంటూ 2023 సెప్టెంబరు 13న అప్పటి కలెక్టర్‌ డి.అమోయ్‌కుమార్‌ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీకి సిఫారసు చేశారు. కానీ, సిఫారసులకు సంబంధించిన ఫైలు మాత్రం కలెక్టరేట్‌లో లేదు. దీంతో 2025 డిసెంబరు 31న మేడ్చల్‌ జిల్లా అధికారులు తయారు చేసిన 22ఏ జాబితాలో ఈ సర్వే నంబరులో ఉన్న భూమిని కూడా చేర్చారు. ఒకవేళ కలెక్టర్‌ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం రిజిస్ట్రేషన్‌ శాఖ అప్పట్లో రిజిస్ట్రేషన్‌కు అనుమతించి ఉంటే ఆ భూములు ఇప్పుడు నిషేధిత జాబితాలో ఉండేవికావు. బాధితులు మాత్రం ‘కలెక్టర్‌ అనుమతించారు.. నిషేధిత జాబితా నుంచి తొలగించండి’ అంటూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ తరహా కేసులు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా రాజధాని పరిధిలో ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. ఎవరి స్థాయిలో వారు సిఫారసులు.. జిల్లా కలెక్టర్‌, ఆర్డీవో, అదనపు కలెక్టర్‌, తహసీల్దార్‌.. ఇలా ఎవరి స్థాయిలో వారు, ఏదో ఒక