
ఉద్యోగుల విచ్చలవిడి వినియోగంతో రహస్య సమాచారానికి లీక్ ముప్పు వ్యక్తిగత గోప్యతపైనా ప్రభావం ఏఐ.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న టూల్. మొన్నటిదాకా గూగుల్‌లో వెతికిన వారంతా ఇప్పుడు కృత్రిమ మేధను (ఏఐ) వినియోగించి పనులను చక్కబెడుతున్నారు. అది ఇల్లైనా, కార్యాలయమైనా ఏఐ లేనిదే పూట గడవని పరిస్థితికి వచ్చారు. అయితే ఇలా కార్యాలయాల్లో అనుమతిలేని, రక్షణలేని విచ్చలవిడి వినియోగాన్ని ‘షాడో ఏఐ’గా పిలుస్తారు. ఉద్యోగులు తమ పని వేగాన్ని పెంచుకోవడానికి, క్రియేటివిటీని పెంచుకోవడానికి దీనిని వినియోగిస్తారు. వారు మంచి ఉద్దేశంతో దానిని వాడినా కంపెనీల రహస్య సమాచారానికి ముప్పుతోపాటు వ్యక్తిగత గోప్యతకూ భంగం వాటిల్లే ప్రమాదముంది. దీంతో షాడో ఏఐ వినియోగంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కంపెనీ అనుమతి లేకుండా రోజూవారీ విధుల్లో ఏఐని ఉద్యోగులు అనధికారికంగా వినియోగించడాన్ని షాడో ఏఐ అంటారు. సాధారణంగా ఉద్యోగులు తమ పనితీరును మెరుగుపరుచుకోవడానికి, పనిని త్వరగా పూర్తి చేయడానికి, సులభతరం చేసుకోవడానికి వాడతారు. నెట్‌వర్క్ ట్రాఫిక్‌ను పర్యవేక్షించడానికి ప్రభావంతమైన షాడో ఏఐ గుర్తింపు వ్యవస్థలను అభివృద్ధి చేసుకోవాలి. ఓ అధ్యయనం ప్రకారం.. చాలా కంపెనీల్లో అనధికార ఏఐ టూల్స్ వినియోగం భారీగా ఉందని తెలుస్తోంది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు