నివేదిక ప్రకారమే కాళేశ్వరం పునరుద్ధరణ.. బ్యారేజీల్లో నీటి నిల్వ ప్రమాదకరం.. అందుకే లిఫ్టింగ్ ఆపేశాం
Actor ProfilePolitician

నివేదిక ప్రకారమే కాళేశ్వరం పునరుద్ధరణ.. బ్యారేజీల్లో నీటి నిల్వ ప్రమాదకరం.. అందుకే లిఫ్టింగ్ ఆపేశాం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నివేదిక ప్రకారమే కాళేశ్వరం పునరుద్ధరణ.. బ్యారేజీల్లో నీటి నిల్వ ప్రమాదకరం.. అందుకే లిఫ్టింగ్ ఆపేశాం
Samayam Telugu30 Oct 2026
నివేదిక ప్రకారమే కాళేశ్వరం పునరుద్ధరణ.. బ్యారేజీల్లో నీటి నిల్వ ప్రమాదకరం.. అందుకే లిఫ్టింగ్ ఆపేశాం

కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నియమించిన టెక్నికల్ ఓవర్‌సైట్ కమిటీ సూచనలు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ఏ) సిఫారసులకు లోబడే కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ చర్యలు చేపడుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్లానింగ్, డిజైన్, నిర్మాణం, ఆపరేషన్ లోపాల వల్లే ప్రమాదాలు జరిగాయని, ప్రస్తుత పరిస్థితుల్లో గేట్లు మూసి నీటిని నిల్వ చేయడం బ్యారేజీలకే కాకుండా దిగువ ప్రాంతాలకు తీవ్ర ప్రమాదకరమని ఎన్‌డీఎస్ఏ హెచ్చరించిందని వివరించారు. గోదావరిలో నీరు పారుతున్నప్పటికీ నీటిని ఎందుకు ఎత్తిపోయడం లేదనే అంశంపై కొందరు రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే బురదజల్లుతున్నారని ఆక్షేపించారు. విమర్శలు చేసేవారు ఎన్‌డీఎస్‌ఏ అధికారిక నివేదికను పరిగణలోకి తీసుకుని మాట్లాడితే బాగుండేదని వ్యాఖ్యానించారు.బ్యారేజీలలో నీటిని ఎత్తిపోయాలంటే కన్నెపల్లి నుండి అన్నారానికి పంపింగ్ చేయడానికి కనీసం 5 టీఎంసీల నీటిని నిరంతరంగా నిల్వ ఉంచాలని, అందుకు గేట్లు మూయడం సాంకేతికంగా తప్పనిసరని సీఎం పేర్కొన్నారు. అయితే, 2023లో మేడిగడ్డ 7వ బ్లాక్ పిల్లర్లు 1.2 మీటర్లు కుంగిపోవడం వల్ల మొత్తం బ్యారేజీ పునాదులు దెబ్బతిన్నాయని ఎన్‌డీఎస్ఏ తన 365 పేజీల నివేదికలో స్పష్టం చేసింది. గేట్లపై హైడ్రాలిక్ ఒత్తిడిని తట్టుకునే శక్తి లేనందున, మరమ్మతులు ముగిసేవరకు గేట్లు మూయవద్దని, అన్ని గేట్లను ఎత్తిపెట్టాలని నిపుణులు ఆదేశించారని తెలిపారు. ఇటువంటి స్థితిలో గేట్లు మూసి నీటిని నిల్వచేస్తే భద్రాచలం పట్టణం వరదలతో ముంచెత్తవచ్చని, ఊర్లకు ఊర్లు కొట్టుకుపోయే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. చట్టబద్ధమైన డ్యామ్ సేఫ్టీ యాక్ట్-2021 ప్రకారం కేంద్ర అథారిటీ నివేదికలను ఏ రాష్ట్రమైనా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.ఈ బ్యారేజీల స్థిరీకరణకు 2026 జూన్ 30న కేంద్రం జాతీయ, రాష్ట్ర నిపుణులతో టెక్నికల్