నిరుద్యోగ జేఏసీ సంచలన నిర్ణయం.. ఈ నెల 15న ఇందిరా పార్క్ వేదికగా మహాధర్నా
Actor ProfilePolitician

నిరుద్యోగ జేఏసీ సంచలన నిర్ణయం.. ఈ నెల 15న ఇందిరా పార్క్ వేదికగా మహాధర్నా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నిరుద్యోగ జేఏసీ సంచలన నిర్ణయం.. ఈ నెల 15న ఇందిరా పార్క్ వేదికగా మహాధర్నా
Zee Telugu5 Nov 2026
నిరుద్యోగ జేఏసీ సంచలన నిర్ణయం.. ఈ నెల 15న ఇందిరా పార్క్ వేదికగా మహాధర్నా

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Unemployed JAC Protest: ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఏటా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేసి, అధికారంలోకి వచ్చాక ఆ మాటను నిలబెట్టుకోని కాంగ్రెస్ పార్టీపై నిరుద్యోగులు జంగ్ సైరన్ మోగించారు. ఈ నేపథ్యంలో, తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో జూలై 15న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ స్క్వేర్‌లో ఒక భారీ నిరుద్యోగ ర్యాలీ నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఇందులో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 30 లక్షల మంది ఈ ర్యాలీలో పాల్గొనాలని నిరుద్యోగ జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 31 నెలలు గడిచినా ఒక్క ప్రధాన నోటిఫికేషన్ కూడా జారీ చేయకపోవడంపై నిరుద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నోటిఫై చేసిన పోస్టులను భర్తీ చేయడం మినహా, ఇప్పటివరకు కాంగ్రెస్ ఏమి చేసిందో వివరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ ర్యాలీకి పిలుపునిచ్చినట్లు నిరుద్యోగ జేఏసీ ప్రకటించింది. నిరుద్యోగ యువత, విద్యార్థులు, ప్రజా సంఘాలు ఇందులో విస్తృతంగా పాల్గొని దీనిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 1) పదవీ విరమణ వయస్సు: ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 సంవత్సరాలకు సవరించాలి. 2) పోలీస్, సీసీఎల్ఏ ఉద్యోగాల పెంపు: సీసీఎల్ఏ ద్వారా 5,944 జీపీఓ పోస్టులను భర్తీ చేయడంతో పాటు, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించిన 7,437 పోస్టులను 20,000కు పెంచాలి. 3) మెగా డీఎస్సీ, అటవీ శాఖ పోస్టులు: రాష్ట్రంలోని