నిరంజన్ మృతి కలచివేసింది
Actor ProfilePolitician

నిరంజన్ మృతి కలచివేసింది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నిరంజన్ మృతి కలచివేసింది
Andhra Jyothy9 Oct 2026
నిరంజన్ మృతి కలచివేసింది

హనుమకొండకు చెందిన నిరంజన్ మృతిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది' అంటూ భావోద్వేగానికి గురయ్యారు. చిన్నారితో గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఇంటర్నెట్ డెస్క్: హనుమకొండకు చెందిన తన అభిమాని నిరంజన్ మృతిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది' అంటూ పవన్ కల్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. అలాగే నిరంజన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ తీరని విషాదాన్ని భరించే శక్తిని వారికి ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించానని అన్నారు. కాగా, ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ కోరిక మేరకు గత నెల 17న పవన్ కల్యాణ్ హనుమకొండలోని అతని ఇంటికి వెళ్లి పరామర్శించిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం అర్ధరాత్రి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిరంజన్ తుదిశ్వాస విడిచాడు. ఈ విషాద ఘటనపై పవన్ కల్యాణ్ ఎక్స్ (X) వేదికగా స్పందిస్తూ.. తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. చిన్నారితో గడిపిన క్షణాలను ఆయన గుర్తు చేసుకున్నారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం