నోయిడా ఎయిర్ పోర్ట్ జలమయం
Actor ProfilePolitician

నోయిడా ఎయిర్ పోర్ట్ జలమయం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నోయిడా ఎయిర్ పోర్ట్ జలమయంపై అఖిలేష్ యాదవ్ సెటైర్లు
Samayam Telugu9 Dec 2026
నోయిడా ఎయిర్ పోర్ట్ జలమయంపై అఖిలేష్ యాదవ్ సెటైర్లు

Noida Airport Waterlogging : ఇటీవలే ప్రారంభమై కార్యకలాపాలు సాగిస్తున్న ప్రతిష్టాత్మక నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (జెవార్ ఎయిర్‌పోర్ట్) వద్ద కురిసిన భారీ వర్షం తీవ్ర కలకలం రేపింది. మంగళవారం కురిసిన వర్షానికి విమానాశ్రయ ఆవరణలో పెద్ద ఎత్తున నీరు నిలిచిపోవడంపై రాజకీయ దుమారం రేగింది. ఈ పరిణామంపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అధికార బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముఖ్యంగా ఇక్కడ విమానాలు నడుస్తాయా లేక పడవలు నడుస్తాయా అంటూ ప్రశ్నించారు.అసలేమైందంటే?టర్మినల్‌ను పార్కింగ్ ప్రాంతంతో అనుసంధానించే మార్గంలో వర్షపు నీరు భారీగా నిలిచిపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. విమానాశ్రయ సిబ్బంది నిలిచిన నీటిని తొలగించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న 28 సెకన్ల వీడియో క్లిప్‌ను అఖిలేష్ యాదవ్ తన అధికారిక ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ముఖ్యంగా ఈ వీడియో కింద "ఇప్పుడు ఈ విమానాశ్రయంలో విమానాలకు బదులు పడవలు నడుపుతారా?" అంటూ అఖిలేష్ యాదవ్ ఘాటుగా ప్రశ్నించారు.స్పందించిన విమానాశ్రయ అధికారులు..!ఈ ఉదంతంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, ఎయిర్‌పోర్ట్ అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి వివరణ ఇచ్చాయి. ఊహించని రీతిలో అత్యంత భారీ వర్షం కురవడం వల్లే తాత్కాలికంగా నీరు నిలిచిపోయిందని అధికారులు స్పష్టం చేశారు. ఘటన జరిగిన వెంటనే స్పందించిన విమానాశ్రయ బృందాలు కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే నిలిచిన నీటిని పూర్తిగా తొలగించాయని.. ఆ మార్గంలో రాకపోకలు వెంటనే సాధారణ స్థితికి వచ్చాయని యూపీ ప్రభుత్వం ప్రకటించింది. విమాన సర్వీసులు, ప్రయాణికుల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదని.. వాతావరణ పరిణామాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని స్పష్టం చేశారు.మార్చి 28న ప్రారంభోత్సవం జరుపుకుని.. జూన్ 15వ తేదీ నుంచి సేవలు అందిస్తున్న ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం కింద నిర్మించారు. అంతర్జాతీయ టెర్మినల్ నిర్మాణ పనులు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నాటికి పూర్తి చేసి.. ఈ