
ఇంటర్నెట్ డెస్క్: తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్(TFTDDA)లో ఇటీవల చోటుచేసుకున్న వివాదంపై జానీ మాస్టర్(Jani Master) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ పరిణామాలను తెలిసీ తెలియక జరిగిన తప్పిదాలుగా భావించి, పెద్ద మనసుతో మన్నించాలని సినీ పరిశ్రమను కోరారు. ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్‌తో వివాదం సమసిపోయినట్లు చెప్పారు. చిత్రసీమలోని అన్ని విభాగాలు ‘టీఎఫ్‌టీడీడీఏ’కు సహాయసహకారాలు అందించాలని అభ్యర్థించారు. తండ్రి కోప్పడినా మళ్లీ దగ్గరకు తీసుకుంటారని, అదే విధంగానే డ్యాన్సర్స్ అసోసియేషన్‌ను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. ‘‘డ్యాన్సర్లకు నిర్మాతలు ఇచ్చిన డబ్బు వారికి పూర్తిగా అందడం లేదన్నదే నా ఆవేదన. దాని గురించే నేను మాట్లాడాను. నా అభిప్రాయాన్ని చిరంజీవిగారితో పాటు పరిశ్రమలోని ఇతర పెద్దలు అర్థం చేసుకున్నారు. అందరితోనూ సామరస్యపూర్వకంగా వ్యవహరిస్తూ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. వారి మాటకు అనుగుణంగానే ముందుకు వెళ్తాం. నేనేమైనా తప్పు మాట్లాడి ఉంటే క్షమించండి’ అని జానీ మాస్టర్ పేర్కొన్నారు. టీఎఫ్‌టీడీడీఏ ఉప ఎన్నికల్లో గెలిచిన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో పీపుల్స్ మీడియా అధినేత టి.జి.విశ్వప్రసాద్ పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. అల్లరి నరేశ్ ప్రధానపాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’ ‘పళ్ళ బురుసు’ లాంటి మంచి సందేశాత్మక చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు నిర్మాత సుప్రియ యార్లగడ్డ