నేనెంత దురదృష్టవంతురాలినో మాటల్లో చెప్పలేను
Actor ProfileCelebrity

నేనెంత దురదృష్టవంతురాలినో మాటల్లో చెప్పలేను

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
చోర శిఖామణులు’కు సపోర్ట్ చేసింది వీరే
Chitrajyothy4 Nov 2026
చోర శిఖామణులు’కు సపోర్ట్ చేసింది వీరే

శ్రీకరి - వివాన్ సమర్పణలో.. శ్రీకరి క్రియేషన్స్ బ్యానర్ పై బానూరు నాగరాజు నిర్మిస్తోన్న చిత్రం ‘చోర శిఖామణులు’. ఆనంద్ కుర్మా ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు

నేనెంత దురదృష్టవంతురాలినో మాటల్లో చెప్పలేను
Chitrajyothy3 Nov 2026
నేనెంత దురదృష్టవంతురాలినో మాటల్లో చెప్పలేను

జానకమ్మ మృతిపై సింగర్ కౌసల్య తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారతీయ సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన గానకోకిల ఎస్. జానకి (S Janaki) మృతి.. ఎందరినో దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కర్ణాటక ప్రభుత్వ లాంఛనాలతో కనియనహుండి ఫాంహౌస్‌లో జానకమ్మ అంత్యక్రియలు ముగిశాయి. పలువురు దక్షిణాది సినీరంగ ప్రముఖులతో పాటు ఆమెను కడసారి చూసేందుకు అభిమానులు తరలివచ్చారు. జానకమ్మ మృతిపై సింగర్ కౌసల్య (Singer Kousalya) తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో.. ‘‘నేను ఎంత దురదృష్టవంతురాలిని అంటే నేను మాటల్లో చెప్పలేను. ఎస్. జానకమ్మని కలవాలని, వారి ముందు పాడాలని, వారితో మాట్లాడాలని ఎప్పటినుంచో కలలు కన్నాను. బట్, ఇంక ఆ కల ఎప్పటికీ నెరవేరదు. ఇది అసలు ప్రాసెస్ చేసుకోలేకపోతున్నాను. చాలా బాధాకరమైన దుర్వార్త. అమ్మ ఎస్. జానకమ్మ, మీ మాటలు వింటూ, మీ పాటల్లో మెళకువలు నేర్చుకుంటూ పెరిగాను నేను. మీరు ఎంతో నేర్పించారు. అసలు డిక్షన్ కానీ, న్యాచురల్‌గా గమకాలని ప్రాసెస్ చేయడం, ఎలాంటి ఆర్టిఫిషియాలిటీ లేకుండా పాడటం ఇవన్నీ మీ నుంచి నేర్చుకున్నాం. ఎస్. జానకమ్మ, పి. సుశీలమ్మ పాటలు విని పెరిగాము. ఎన్నో థింగ్స్ అడాప్ట్ చేసుకున్నాము, ఎన్నో మెళకువలు నేర్చుకున్నాము. ఒక్కసారి కూడా కలిసే అవకాశం రాలేదు. చాలా దురదృష్టవంతులం. నేనసలు ప్రాసెస్ చేసుకోలేకపోతున్నాను. ఎస్. జానకమ్మ, వి మిస్ యు సో మచ్. ఒక రిలీఫ్ ఏంటంటే రీసెంట్ టైమ్స్ లో ఎస్. జానకమ్మ బర్త్ డేకి ‘గున్నమామిడి కొమ్మమీద’ పాట పాడి.. రీల్ పోస్ట్ చేసినప్పుడు, జానకమ్మ ఆత్మీయులు వారికి ఆ వీడియో చూపించి.. ‘కౌసల్య మీ బర్త్ డేకి ట్రిబ్యూట్‌గా ఈ వీడియో