
Eenadu•6 Nov 2026
నిందితుడికి వేసిన జరిమానాతో జల్సాఝార్ఖండ్లో ఓ అమానవీయ సంఘటన చోటుచేసుకొంది. ఇటీవల ఓ వ్యక్తి మూడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో నిందితుడిని స్థానిక పెద్దల వద్దకు తీసుకొచ్చి పంచాయతీ పెట్టించారు. కాగా, విషయం పోలీసుల దృష్టికి వెళ్లకుండా సమస్యను పరిష్కరిస్తామని బాధిత కుటుంబాన్ని ఒప్పించిన పంచాయతీ పెద్దలు నిందితుడికి రూ.లక్ష జరిమానా విధించారు. అయితే నిందితుడు ఆ మొత్తంలో ముందుగా చెల్లించిన రూ.20వేలను బాధితురాలికి అందజేయకుండా పార్టీ చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. నిందితుడికి వేసిన జరిమానాతో జల్సా