నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను అవమానించారనే ఆరోపణలు ఎదుర్కొంటోన్న బీజేపీ ఎంపీ నాగేంద్ర రాయ్‌కు పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం షాకిచ్చింది. ఆయనకు గతంలో ఇచ్చిన ‘బంగ విభూషణ్’ అవార్డును వెనక్కి తీసుకుంటున్నట్టు గురువారం ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి మమతా బెనర్జీ ప్రభుత్వం ఆయనను ఈ అవార్డుతో సత్కరించింది. నాగేంద్ర రాయ్ అనంత్ మహరాజ్ పేరుతో పాపులర్ అయ్యారు. నేతాజీపై గత నెలలో అనంత్ మహరాజ్ చేసిన వ్యాఖ్యలతో బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. భారత స్వాతంత్య్ర పోరాటంలో ఆజాద్ హింద్ ఫౌజ్ పాత్ర, నేతాజీ నాయకత్వం, కూచ్ బెహార్ మహారాజు చారిత్రక ప్రాముఖ్యతకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం.ప్రతిపక్షాలతో పాటు బీజేపీలోని ఒక వర్గం కూడా ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వాతంత్ర్య సమరయోధుడు, బెంగాల్‌లో అత్యంత గౌరవనీయ నాయకుడైన నేతాజీపై సోషల్ మీడియాలో అభ్యంతరర వ్యాఖ్యలు చేసే వారిపై అరెస్టులతో సహా కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సువేందు అధికారి పోలీసులను ఆదేశించిన 24 గంటల్లోనే ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ చట్టం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులకు సమానంగా వర్తిస్తుందని కూడా ఆయన తెలిపారు. స్వాతంత్య్ర సంగ్రామంలో అజాద్ హింద్ ఫౌజ్ పాత్ర, బోస్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ నేతాజీని ‘యుద్ధ నేరస్థుడు’ అని అనంత్ మహరాజ్ అభివర్ణించిన కొద్ది రోజులకే సీఎం సువేందు అధికారి పోలీసులకు ఈ ఆదేశాలు జారీ చేశారు.ఉత్తర బెంగాల్‌లోని రాజబన్షీ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ బీజేపీ నాయకులలో ఒకరైన అనంత మహారాజ్.. రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఫిబ్రవరిలో ఈ బీజేపీ ఎంపీకి బంగా బిభూషణ్ పురస్కారం లభించింది. రాష్ట్రానికి, దాని ప్రజలకు చేసిన విశిష్టమైన, ఆదర్శప్రాయమైన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేస్తారని, దీనికి అత్యున్నత గౌరవం, ప్రతిష్ట ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.‘‘బంగ విభూషణ్ పురస్కారానికి నాగేంద్ర
Actor ProfilePolitician
నేతాజీని అవమానించిన బీజేపీ ఎంపీ.. బెంగాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•17 Dec 2026
నేతాజీని అవమానించిన బీజేపీ ఎంపీ.. బెంగాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం