నాడు విడిపోతే చెడిపోతాం
Actor ProfilePolitician

నాడు విడిపోతే చెడిపోతాం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నాడు విడిపోతే చెడిపోతాం అన్నారు.. నేడు తెలంగాణ టీచర్లకు నిజంగానే అన్యాయం జరిగిందా
Zee Telugu7 Nov 2026
నాడు విడిపోతే చెడిపోతాం అన్నారు.. నేడు తెలంగాణ టీచర్లకు నిజంగానే అన్యాయం జరిగిందా

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. AP Vs Telangana Government Employees: ఉమ్మడి రాష్ట్రంతోనే అందరికీ రక్షణ.. విడిపోతే చెడిపోతాం.. 2014 రాష్ట్ర విభజన సమయంలో ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు భవిష్యత్తును ద్రుష్టిలో ఉంచుకుని చెప్పిన మాట ఇది. ఇప్పుడు దశాబ్ద కాలం తర్వాత తెలంగాణ ఉపాధ్యాయ లోకంలో ఓ సరికొత్త చర్చ మొదలైంది. స్వరాష్ట్రం వస్తే తమ బతుకులు బాగుంటాయి.. హక్కులు మరింత సులువుగా సాధించుకోవచ్చని భావించిన తెలంగాణ టీచర్లకు ప్రస్తుతం ఎదురవుతున్న చేదు అనుభవాలు.. ఆంధ్రప్రదేశ్ తో పోల్చితే స్పష్టమైన వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య ఉపాధ్యాయుల హక్కులు.. సాధించుకున్న విజయాలపై సాగుతున్న ఆసక్తికర పోలికలు చూస్తే.. స్పష్టమైన వ్యత్యాసాలు ఎన్నో కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో కాలంగా పోరాడుతున్న డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు అయ్యేలా చూడటంలో అక్కడి ఉపాధ్యాయ లోకం విజయం సాధించిందని చెప్పాలి. తాజాగా జీవో 53 ద్వారా కూడా ప్రభుత్వం పాత పెన్షన్ మార్పునకు అంగీకారం తెలిపింది. మరి ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్న తెలంగాణ రాష్ట్రంలో ఈ డిమాండ్ పై ఇప్పటి వరకు పూర్తి స్థాయి స్పష్టత లేకపోవడం నిజంగా ఉపాధ్యాయులను విస్మయానికి గురిచేస్తోంది. ఏపీలో భాషోపాధ్యాయుల అప్ గ్రేడేషన్ ప్రక్రియలో 2019లోనే పూర్తి చేయించి తమ సత్తా చాటుకున్నారు ఉపాధ్యాయులు. తెలంగాణ లో మాత్రం దశాబ్దాల కాలం నిరీక్షణ, ఎన్నో కొట్లాటలు, పోరాటాల తర్వాత 2024లో ఈ ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది. అంటే 5ఏళ్ల పాటు తెలంగాణ ఉపాధ్యాయులు నష్టపోయారు. ఇక ట్రాన్స్ ఫర్స్, ప్రమోషన్ల విషయంలోనూ ఏపీ ముందుంది. నిరంతర ప్రక్రియగా ప్రతి 2ఏళ్లకోసారి ఉపాధ్యాయుల ట్రాన్స్ ఫర్స్