నేటి నుంచి మండలస్థాయిలో ప్రజావాణి.. ఫిర్యాదుల కోసం టైమింగ్స్ ఇవే
Actor ProfilePolitician

నేటి నుంచి మండలస్థాయిలో ప్రజావాణి.. ఫిర్యాదుల కోసం టైమింగ్స్ ఇవే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నేటి నుంచి మండలస్థాయిలో ప్రజావాణి.. ఫిర్యాదుల కోసం టైమింగ్స్ ఇవే
Samayam Telugu2 Jan 2027
నేటి నుంచి మండలస్థాయిలో ప్రజావాణి.. ఫిర్యాదుల కోసం టైమింగ్స్ ఇవే

ప్రజలకు మరింత చేరువగా పరిపాలనను తీసుకెళ్లే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలకమైన అడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న వినతుల పరిష్కారం కోసం నేటి (సోమవారం) నుంచి మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని మొత్తం 620 మండలాల్లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించనున్నారు. ప్రతి వినతిని అక్కడికక్కడే కంప్యూటర్లలో నమోదు చేసి, అర్జీదారులకు ప్రత్యేక రిజిస్ట్రేషన్‌ నంబర్‌ను అందజేయనున్నారు. ఈ నంబర్ ఆధారంగా తమ ఫిర్యాదు ఏ దశలో ఉందో ప్రజలు సులభంగా తెలుసుకునేలా డిజిటల్ వ్యవస్థను రూపకల్పన చేశారు.ప్రస్తుతం రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తున్న ప్రజావాణికి ప్రతి వారం విపరీతమైన స్పందన వస్తుండగా, అందులో దాదాపు 70 శాతం సమస్యలు మండల స్థాయిలోనే పరిష్కరించాల్సినవేనని అధికారులు గుర్తించారు. దీంతో సామాన్య ప్రజలు చిన్న చిన్న సమస్యల కోసం కూడా జిల్లా లేదా రాష్ట్రస్థాయి కార్యాలయాల చుట్టూ తిరిగే ఇబ్బందులను తప్పించేందుకు ఈ విధానాన్ని తెచ్చారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. మండల స్థాయి ప్రజావాణి నిర్వహణ కోసం ఎంపీడీవోలను నోడల్ అధికారులుగా నియమించారు. కార్యక్రమ నిర్వహణ, అర్జీల స్వీకరణ, వాటిని సంబంధిత శాఖలకు బదిలీ చేయడం, పరిష్కారంపై నిరంతరం పర్యవేక్షించడం వంటి బాధ్యతలను వీరు సమన్వయం చేయనున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఎంపీడీవోలకు ప్రత్యేక శిక్షణ కూడా అందించారు. గ్రామాల్లో చాటింపు వేయడంతో పాటు సోషల్ మీడియా ద్వారా ఈ కార్యక్రమంపై విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ సొంత భవనాలు లేని 152 మండల కేంద్రాల్లో అద్దె భవనాల్లోనూ ప్రజావాణి నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.ప్రజావాణి కేంద్రాల్లో కంప్యూటర్లు, స్కానర్లు, ఇంటర్నెట్ సౌకర్యంతో పాటు హెల్ప్‌డెస్క్‌ ఆపరేటర్లను సిద్ధం చేశారు. ప్రజల నుంచి లిఖితపూర్వక వినతిని స్వీకరించిన వెంటనే పోర్టల్‌లో నమోదు చేసి రసీదు ఇస్తారు. ఈ కార్యక్రమంలో కేవలం