నేటి నుంచి ప్రధాని మోడీ మూడు దేశాల పర్యటన.. అసలు ఎజెండా ఇదే
Actor ProfilePolitician

నేటి నుంచి ప్రధాని మోడీ మూడు దేశాల పర్యటన.. అసలు ఎజెండా ఇదే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నేటి నుంచి ప్రధాని మోడీ మూడు దేశాల పర్యటన.. అసలు ఎజెండా ఇదే
Zee Telugu25 Sept 2026
నేటి నుంచి ప్రధాని మోడీ మూడు దేశాల పర్యటన.. అసలు ఎజెండా ఇదే

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. PM Narendra Modi Visits 3 Coutries: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం నుంచి మూడు రోజులపాటు ఇండోనేసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల్లో పర్యటించబోతున్నారు. ముందుగా ఆయన ఇండోనేసియాకు చేరుకుంటారు. ముఖ్యంగా ఇండో పసిఫిక్ దేశాల్లో పర్యటన వెనక కీలక అజెండా ఉంది. 2016 తర్వాత మోడీ ఆ దేశానికి వెళ్తుండడం ఇదే మొదటిసారి. ముఖ్యంగా హిందూ మహా సముద్రం, పసిఫిక్ మహా సముద్రం కలిసే కీలక ప్రాంతంలో ఉన్న ఇండోనేషియాలో పర్యటించనుండటం భౌగోళికంగా రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఇండోనేషియాకు అతి సమీపంలో మలక్కా, సుండా, లుంబోక్ జలసంధులు పపిఫిక్, హిందూ సముద్రాలను కలిపే మార్గాలున్నాయి. ప్రపంచంలో ముఖ్యంగా చైనా ఎక్స్‌పోర్ట్‌లో 90 శాతం మలక్కా జలసంధి గుండానే సాగుతుంది. ముఖ్యంగా గ్రేటర్ నికోబార్‌లో భారత్ తలపెట్టిన 80వేల కోట్ల రూపాయలతో నిర్మిస్తోన్న అతిభారీ ప్రాజెక్ట్‌ కు అతి సమీపంలో ఇండోనేషియా ఉంది. ఇది మలక్కా జలసంధి సమీపంలో ఉంది. దీంతో ఆయా మార్గాల్లో వెళ్లే నౌకలపై మన దేశం నిఘా పెట్టే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశం రక్షణ, దౌత్యపరమైన సంబంధాలను బలోపేతం దిశగా ప్రధాని ఆ దేశానికి వెళ్లనున్నట్టు అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నా మాట. 2018లోనే ఇండోనేషియాతో సమగ్ర వ్యూహాత్మిక భాగస్వామ్యం కుదిరింది. ఇప్పటికే ఇండోనేషియాకు భారత్ నుంచి బ్రహ్మోస్ క్షిపణులను ఇచ్చే విషయంలో చర్చలు జరుగుతున్నాయి. అక్కడ నికెల్, పామాయిల్ దిగుమతులను భారత్ చేసుకుంది. గ్రేటర్ నికోబార్ ప్రాజెక్ట్ లో