నేటి అర్ధరాత్రితో విశాఖ విమానాశ్రయం సేవలు సమాప్తం
Actor ProfilePolitician

నేటి అర్ధరాత్రితో విశాఖ విమానాశ్రయం సేవలు సమాప్తం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నేటి అర్ధరాత్రితో విశాఖ విమానాశ్రయం సేవలు సమాప్తం
Eenadu29 Dec 2026
నేటి అర్ధరాత్రితో విశాఖ విమానాశ్రయం సేవలు సమాప్తం

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇవాళ అర్ధరాత్రి నుంచి విశాఖ విమానాశ్రయం సేవలు సమాప్తం కానున్నాయి. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆగస్టు 17 నుంచి విమాన రాకపోకలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విశాఖపట్నం విమానాశ్రయం నుంచి షెడ్యూల్‌ విమానాలను నిలిపేస్తున్నట్లు పౌరవిమానయానశాఖ ఇప్పటికే ప్రకటించింది. 30 ఏళ్లపాటు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌ (ఐఎన్‌ఎస్‌ డేగ) సివిల్‌ ఎన్‌క్లేవ్‌ నుంచి షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ విమానాల రాకపోకలను నిలిపేస్తున్నట్లు తెలిపింది. జాతీయ అత్యవసర పరిస్థితుల్లో ఈ నిబంధనకు మినహాయింపు ఉంటుందని పేర్కొంది. భారతీయ వాయుసేన, సాయుధ దళాలు, పోలీసు విమానాలు, ప్రభుత్వ అతిథులు రాకపోకలు సాగించే విమానాలు, లీజ్, వీఐపీ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఇక్కడి నుంచి నడుస్తాయని.. నాన్‌షెడ్యూల్డ్‌ వాణిజ్య కార్యకలాపాలూ కొనసాగుతాయని పేర్కొంది. ఇప్పటి వరకు విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు ఉన్న అంతర్జాతీయ ట్రావెల్‌కోడ్‌ ‘వీటీజెడ్‌’ ఆగస్టు 17 అర్ధరాత్రి 00:01 గంటల నుంచి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి బదిలీ అవుతుందని కేంద్రం తెలిపింది. వాస్తవానికి భోగాపురం నుంచి సింగపూర్‌కు తొలి విమానం ఈనెల 16న బయలుదేరుతుందని అనుకున్నారు. కానీ, ఈనెల 17న ఉదయం సర్వీసులు ప్రారంభించాలని నిర్ణయించారు. ఇప్పటికే భోగాపురం నుంచి హైదరాబాద్, దిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, తిరుపతికి ఇండిగో సంస్థ తొలి రోజు 31 సర్వీసులు నడపడానికి ప్రణాళిక రూపొందించింది. భోగాపురంలోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలపై విమానయాన సంస్థలు ఒక్కొక్కటిగా తమ షెడ్యూళ్లను విడుదల చేస్తున్నాయి. ఈ నెల 16 అర్ధరాత్రి నుంచి విశాఖ ఎయిర్‌పోర్ట్‌ సేవలు రద్దు కానుండగా.. అక్కడి నుంచి సేవలందించే విమానాలన్నీ భోగాపురం నుంచి వెళ్లనున్నాయి. భోగాపురం నుంచి హైదరాబాద్‌కు ఈ నెల 17న ఉదయం 8.55, 10.40, మధ్యాహ్నం ఒంటిగంట, సాయంత్రం 4.25, రాత్రి 7.20, 8.40, 9.20 గంటలకు బయలుదేరనున్నాయి. దిల్లీకి ఉదయం 8.20, రాత్రి 10.45, బెంగళూరుకు మధ్యాహ్నం 2.55, రాత్రి 9.10, చెన్నైకి మధ్యాహ్నం 12.15, సాయంత్రం 6.35