
భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ 54వ పుట్టినరోజు నేడు. ఆయన జీవిత కథ ఆధారంగా తెరుక్కుతున్న చిత్రం ‘దాదా: ది సౌరభ్ గంగూలీ స్టోరీ’. గంగూలీ పుట్టినరోజు సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్‌పై గంగూలీ స్పందించాడు. ఇంటర్నెట్ డెస్క్: భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ 54వ పుట్టినరోజు నేడు. ఆయన జీవిత కథ ఆధారంగా తెరుక్కుతున్న చిత్రం ‘దాదా: ది సౌరభ్ గంగూలీ స్టోరీ’. గంగూలీ పుట్టినరోజు సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానం బాల్కనీలో చొక్క విప్పి ఊపుతూ చేసుకున్న ఐకానిక్ సెలబ్రేషన్స్ ఫొటోను రీక్రియేట్ చేశారు. ఈ పోస్టర్‌పై గంగూలీ స్పందించాడు. తన జీవితంలోనే ఇది అత్యుత్తమ పుట్టిన రోజు కానుక అంటూ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. జాతీయ అవార్డు గ్రహీత రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ బయోపిక్ వచ్చే ఏడాది మే 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ ఆవిష్కరణ అనంతరం గంగూలీ మాట్లాడాడు. ‘పుట్టినరోజు ఎప్పుడూ ప్రత్యేకమే. కానీ నా బయోపిక్ ఫస్ట్ లుక్‌ను ఇదే రోజున విడుదల చేయడం ఈ రోజును మరింత చిరస్మరణీయంగా మార్చింది. ఇంతకంటే గొప్ప బహుమతి ఇంకొకటి ఉండదు. ఈ పోస్టర్ చూసిన వెంటనే నా కెరీర్‌లోని ఓ అద్భుతమైన క్షణం కళ్ల ముందు మెదిలింది. రాజ్‌కుమార్ రావు ఈ పాత్ర కోసం ఎంతో నిబద్ధతతో సిద్ధమయ్యాడు. అతను నా ప్రయాణాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తాడనే నమ్మకం ఉంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అభిమానులంతా థియేటర్లలో చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అని గంగూలీ వెల్లడించాడు. గంగూలీ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే సోషల్