నా చావుకు కారణం నువ్వే.. నిన్ను వదిలే ప్రసక్తే లేదు.. నవదీప్
Actor ProfileActor

నా చావుకు కారణం నువ్వే.. నిన్ను వదిలే ప్రసక్తే లేదు.. నవదీప్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నా చావుకు కారణం నువ్వే.. నిన్ను వదిలే ప్రసక్తే లేదు.. నవదీప్ పై ఉప్పల్ బాలు సంచలన కామెంట్స్,
Asianet News Telugu28 Dec 2026
నా చావుకు కారణం నువ్వే.. నిన్ను వదిలే ప్రసక్తే లేదు.. నవదీప్ పై ఉప్పల్ బాలు సంచలన కామెంట్స్,

ఉప్పల్ బాలు చాలా కాలంగా బిగ్ బాస్ లోకి వస్తాడన్న ప్రచారం జరుగుతూ వస్తోంది. కానీ బిగ్ బాస్ టీమ్ డైరెక్ట్ గా అతన్ని పిలవకపోవడంతో.. సామాన్యుల కోటాలో బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2 ఆడియన్స్ కు వెళ్లాడు. ఈసారి పక్కాగా బిగ్ బాస్ హౌస్ లోకి బాలు వస్తాడని అంతా అనుకున్నారు. కానీ అనుకోకుండా ఈ షోలో రిజెక్ట్ అవ్వడంతో పాటు పలు అవమానాలు కూడా ఫేస్ చేశాడు బాలు. అయితే ఆడిషన్స్ ప్రక్రియలో తన ప్రతిభను నిరూపించుకునే అవకాశం కూడా ఇవ్వకుండా, కేవలం సోషల్ మీడియా వీడియోల ఆధారంగా తక్కువ చేసి మాట్లాడి తిరస్కరించారని బాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదంపై ఉప్పల్ బాలు వరుస వీడియోలను విడుదల చేస్తున్నాడు. బిగ్ బాస్ తో పాటు అగ్నిపరీక్ష 2 జడ్జ్ గా ఉన్న నవదీప్ ను టార్గెట్ చేసుకుని... విమర్శలు భారీగా విమర్శలు చేస్తున్నాడు. ఘాటుగా స్పందించిన బాలు.. నటుడు నవదీప్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మొదట గ్రూప్ డిస్కషన్ విభాగంలో ఒక జడ్జ్ తన పర్ఫామెన్స్ కు, హాస్యానికి ఇంప్రెస్ అయి తదుపరి రౌండ్‌కు ఎంపిక చేశారని, నువ్వు సెలెక్ట్ అయ్యావంటూ మెయిల్ కూడా పెట్టారని.. అన్ని నిబంధనలు పూర్తయ్యాక స్టేజ్ మీదికి వచ్చాక అసలు వివాదం మొదలైందని బాలు తెలిపారు. "స్టేజ్ పైకి వచ్చాక నన్ను నవదీప్ తీవ్రంగా అవమానించారు. నాకున్న ఫాలోయింగ్, వ్యక్తిగత గుర్తింపు, నేను చేసే వీడియోల శైలి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ మాటలు నన్ను తీవ్రంగా గాయపరిచాయి. నా మానసిక వేదనకు, భవిష్యత్తులో నాకు ఏమైనా జరిగితే దానికి నవదీపే బాధ్యత వహించాల్సి ఉంటుంది. నిన్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదు. నా చావుకు నువ్వే కారణం" అంటూ కంటతడి పెట్టారు. ఆడిషన్స్‌లో కంటెస్టెంట్ పట్ల జడ్జీలు ప్రవర్తించిన తీరుపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. బాలుకు