
ఇండస్ట్రీ ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ఎవరు ఎప్పుడు ఎంతకాలం ఉంటారు అని చెప్పడం చాలా కష్టం. ఒకప్పుడు వరుస సినిమాలతో థియేటర్లలో, సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన టాలీవుడ్ కుర్ర హీరోలు నాగ్ శౌర్య, కార్తికేయ గుమ్మకొండ ప్రస్తుతం పరిశ్రమలో ఎక్కడా కనిపించడం లేదు. ఇండస్ట్రీ ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ఎవరు ఎప్పుడు ఎంతకాలం ఉంటారు అని చెప్పడం చాలా కష్టం. ఒకప్పుడు వరుస సినిమాలతో థియేటర్లలో, సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన టాలీవుడ్ కుర్ర హీరోలు నాగశౌర్య, కార్తికేయ గుమ్మకొండ (Kartikeya) ప్రస్తుతం పరిశ్రమలో ఎక్కడా కనిపించడం లేదు. నాగశౌర్య (Naga Shaurya).. ఊహలు గుసాగుసలాడే సినిమాతో కెరీర్ ని మొదలు పెట్టి ఛలో, ఓ బేబీ, జో అచ్యుతానంద వంటి సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక మరో హీరో అయిన కార్తికేయ ఆర్ఎక్స్ 100 సినిమాతో ఒక్కసారిగా యూత్‌లో సంచలనం సృష్టించాడు. అయితే, నాగ్ శౌర్య నటించిన రంగబలి, కార్తికేయ చివరిగా నటించిన భజే వాయు వేగం చిత్రాల తర్వాత వీరిద్దరి నుంచి ఇప్పటివరకు ఎలాంటి కొత్త ప్రాజెక్ట్ ప్రకటనలు రాలేదు. కనీసం సినీ వేడుకల్లో గానీ, సోషల్ మీడియా యాక్టివిటీస్‌లో గానీ ఈ యంగ్ హీరోలు కనిపించకపోవడంతో అభిమానులు అసలు వీళ్లు ఏం చేస్తున్నారు అని చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం పరిశ్రమలో సరైన కథలు ఎంచుకోకపోవడం వల్లే వీరికి గ్యాప్ వచ్చిందా లేదా అవకాశాలు తగ్గడం వల్లే దూరంగా ఉంటున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నటనతో పాటు వేరే ఏవైనా సొంత వ్యాపారాలపై దృష్టి పెట్టారా అనే ప్రచారం కూడా సాగుతోంది. ముఖ్యంగా కార్తికేయ విషయానికి వస్తే, అతనికి సోలో హీరోగానే కాకుండా నెగెటివ్ పాత్రల్లో మెప్పించే సత్తా ఉంది. గతంలో నాని గ్యాంగ్ లీడర్, అజిత్ వలిమై చిత్రాల్లో విలన్‌గా నటించి తన నటనతో ఆకట్టుకున్నాడు. అంతటి పొటెన్షియల్ ఉన్న హీరో