నాగార్జున్ సాగర్ లో ప్రభుత్వ ఆధ్వర్యంలో వరుణ యాగం
Actor ProfilePolitician

నాగార్జున్ సాగర్ లో ప్రభుత్వ ఆధ్వర్యంలో వరుణ యాగం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నాగార్జున్ సాగర్ లో ప్రభుత్వ ఆధ్వర్యంలో వరుణ యాగం
Zee Telugu24 Nov 2026
నాగార్జున్ సాగర్ లో ప్రభుత్వ ఆధ్వర్యంలో వరుణ యాగం

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Telangana Government Varuna Yagam: తెలంగాణ రాష్ట్రం మరో మహత్తర కార్యానికి వేదికగా నిలిచింది. తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా సరైన వర్షాలు లేక కరువు తాండవిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆగమ శాస్త్ర పండితుల సలహా మేరకు వర్షాలు సమృద్దిగా కురిసి ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశ్యంతో వరుణ యాగాన్ని తలపెట్టింది. ఇప్పటికే యాగం నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. 108 పండితులు.. 11 హోమ గుండాలతో వరుణ యాగం.. 108 మంది ఋత్వికులతో, 11 హోమగుండాలతో విజయ్ విహార్‌లో వరుణ యాగం తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభమైంది. కృష్ణా నది ఒడ్డున గోపూజ, విశ్వక్సేన పూజతో యాగక్రతువు ప్రారంభమైంది. వరుణ యాగాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు ప్రారంభించారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చెందిన అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో వ‌రుణ‌ యాగం జరిపిస్తున్నారు. పూర్ణాహుతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్.. ఈ సందర్భంగా కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురవాలని సంకల్పించనున్నారు. పెద్ద ఎత్తున మంత్రులు, అధికారులు, నాయకులు పాల్గొననున్నారు. నాగార్జునసాగర్‌లో నిర్వహించే వరుణ యాగానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హాజరు కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే పూర్ణా హుతి కార్యక్రమంలో రేవంత్‌ పాల్గొని పూజలు చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్