తెలుగు సినీ పరిశ్రమలో ‘ గీతాంజలి ’ ఒక ట్రెండ్ సెట్టర్. ప్రేమకథా చిత్రాల చరిత్రను ‘గీతాంజలి’కి ముందు, తర్వాత అని విభజించవచ్చంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి. రెండు జీవితాల భావోద్వేగాల ప్రయాణాన్ని వెండితెరపై ఒక దృశ్య కావ్యంగా మలిచి, ప్రేక్షకుల గుండెల్లో శాశ్వత ముద్ర వేసిన ఈ అద్భుత ప్రేమకావ్యం సరికొత్త హంగులతో మరోసారి వెండితెరపై మెరవడానికి సిద్ధమవుతోంది. అక్కినేని నాగార్జున పుట్టినరోజు(ఆగస్టు 29) కానుకగా ఈ అపురూప చిత్రాన్ని 4K అల్ట్రా హెచ్‌డీ డిజిటల్ టెక్నాలజీతో ఆగస్టు 28న తెలుగు, తమిళ భాషల్లో రీ రిలీజ్ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు.* తిరుమలలో నయనతార గుండు కొట్టించుకుందా?లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెలుగులో నేరుగా దర్శకత్వం వహించిన ఏకైక చిత్రంగా ‘గీతాంజలి’ చరిత్రలో నిలిచిపోయింది. 1989లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, అప్పటి ట్రెండ్‌ను పూర్తిగా మార్చివేసి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చింది. ప్రాణాంతకమైన వ్యాధితో పోరాడుతున్న ఇద్దరు వ్యక్తులు అనుకోని పరిస్థితుల్లో పరిచయమై, మిగిలి ఉన్న క్షణాలను ఎంతో ఆనందంగా, స్వచ్ఛమైన ప్రేమతో ఎలా గడిపారనేది ఈ కథలోని అసలు జీవం. విషాద నేపథ్యమున్నా, ఎక్కడా కన్నీళ్లతో కుంగిపోకుండా జీవితాన్ని ఉల్లాసంగా ఎలా ఆస్వాదించాలో చూపించిన విధానం సినీ ప్రేమికులను ఇప్పటికీ కట్టిపడేస్తుంది.ప్రకాష్ అనే సున్నితమైన యువకుడి పాత్రలో నాగార్జున ఒదిగిపోయిన తీరు ఆయన కెరీర్‌లోనే ఓ మైలురాయిగా నిలిచింది. చలాకీతనంతో పాటు లోతైన భావాలను పలికించిన గీతాంజలి పాత్రలో గిరిజ శెట్టర్ నటన అనితరసాధ్యం. వీరిద్దరి మధ్య సాగే చిలిపి సంభాషణలు, కెమిస్ట్రీ సినిమాను అజరామరంగా మార్చేశాయి. ఈ చిత్రానికి పనిచేసిన సాంకేతిక బృందం భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమమైనదిగా నిలిచింది. ఇళయరాజా ఆయన స్వరపరిచిన ప్రతి పాట, అందించిన నేపథ్య సంగీతం శ్రోతల మనస్సులలో ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. పొగమంచు దుప్పట్లు కప్పుకున్న ఊటీ అందాలను, కథలోని మూడ్‌ను పీసీ శ్రీరామ్ తన కెమెరా ఫ్రేమ్‌లలో బంధించి ప్రతి దృశ్యాన్ని
Actor ProfileCelebrity
నాగార్జున బర్త్ డే స్పెషల్ … 4 హంగులతో మళ్లీ మురిపించనున్న గీతాంజలి
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•12 Jan 2027
నాగార్జున బర్త్ డే స్పెషల్ … 4 హంగులతో మళ్లీ మురిపించనున్న గీతాంజలి