నాగ్ 100వ సినిమాకు పోటీగా చైతూ వృషకర్మ’.. డిసెంబర్ లో తండ్రీకొడుకుల బాక్సాఫీస్ వార్ తప్పదా
Actor ProfileActor

నాగ్ 100వ సినిమాకు పోటీగా చైతూ వృషకర్మ’.. డిసెంబర్ లో తండ్రీకొడుకుల బాక్సాఫీస్ వార్ తప్పదా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నాగ్ 100వ సినిమాకు పోటీగా చైతూ వృషకర్మ’.. డిసెంబర్ లో తండ్రీకొడుకుల బాక్సాఫీస్ వార్ తప్పదా
TV9 Telugu21 Nov 2026
నాగ్ 100వ సినిమాకు పోటీగా చైతూ వృషకర్మ’.. డిసెంబర్ లో తండ్రీకొడుకుల బాక్సాఫీస్ వార్ తప్పదా

టాలీవుడ్‌ కింగ్ నాగార్జున మైల్‌ స్టోన్ మూవీ కోసం అక్కినేని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. తన లక్కీ మంత్‌లో ఈ 100వ చిత్రాన్ని రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాలని నాగ్ ప్లాన్ చేస్తున్నారు. కానీ సడన్‌గా ఆయనకు పోటీగా కొడుకు నాగచైతన్య కూడా అదే నెలలో బరిలోకి దిగుతున్నారన్న టాక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఒకే నెలలో తండ్రీ కొడుకులు బాక్సాఫీస్ వార్‌కు సై అంటారా..? లేక ఎవరో ఒకరు వెనక్కి తగ్గుతారా..? అసలు అక్కినేని కాంపౌండ్‌లో ఏం జరగబోతోంది..? టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జున కెరీర్‌లో 100వ సినిమా మీద అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మైల్ స్టోన్ మూవీని మేకర్స్ చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ నెల నాగార్జునకు సెంటిమెంట్‌ కావడంతో, ఈ ల్యాండ్‌మార్క్ మూవీని డిసెంబర్‌లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు. నాగ్ ఫ్యాన్స్ కూడా ఈ లక్కీ మంత్ రిలీజ్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇలాంటి టైమ్‌లో అక్కినేని కాంపౌండ్ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. యువసామ్రాట్ నాగచైతన్య నటిస్తున్న వృషకర్మ మూవీని కూడా డిసెంబర్‌ రిలీజ్‌కే టార్గెట్ చేస్తున్నారన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. తండేల్‌ లాంటి బిగ్ హిట్ తరువాత చైతూ చేస్తున్న సినిమా కావటంతో వృషకర్మ మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా మంచి రిలీజ్ డేట్‌ కోసం ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరు హీరోలు ఒకే నెలలో బరిలోకి దిగితే ఓపెనింగ్స్, థియేటర్ల పరంగా ఇబ్బందులు వస్తాయి. పైగా నాగార్జునది 100వ సినిమా. ఇలాంటి ప్రతిష్టాత్మక చిత్రానికి సోలో రిలీజ్ ఉంటేనే క్రేజ్ మరింత పెరుగుతుంది. ఒకవేళ డిసెంబర్‌కే ఇద్దరూ ఫిక్స్ అయితే తండ్రీ కొడుకుల మధ్య బాక్సాఫీస్ ఫైట్ తప్పదు. మరి నాగ్ మైల్ స్టోన్ మూవీ కోసం చైతూ