నౌకాదళంలోకి ఐఎన్ఎస్ మహేంద్రగిరి.. జులై 11న విశాఖలో కమిషనింగ్
Actor ProfilePolitician

నౌకాదళంలోకి ఐఎన్ఎస్ మహేంద్రగిరి.. జులై 11న విశాఖలో కమిషనింగ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నౌకాదళంలోకి ఐఎన్ఎస్ మహేంద్రగిరి.. జులై 11న విశాఖలో కమిషనింగ్
AP7AM1 Oct 2026
నౌకాదళంలోకి ఐఎన్ఎస్ మహేంద్రగిరి.. జులై 11న విశాఖలో కమిషనింగ్

భారత నౌకాదళం తన అమ్ములపొదిలో మరో శక్తిమంతమైన ఆయుధాన్ని చేర్చుకోనుంది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ప్రాజెక్ట్ 17A సిరీస్‌లో ఆరవ స్టెల్త్ యుద్ధనౌక 'ఐఎన్ఎస్ మహేంద్రగిరి' 2026, జూలై 11న విశాఖపట్నంలో అధికారికంగా విధుల్లోకి చేరనుంది. గత నెలలోనే ఐఎన్ఎస్ దూనగిరి నౌకాదళంలో చేరగా, త్వరలోనే మహేంద్రగిరి కూడా అందుబాటులోకి రానుంది. ఈ యుద్ధనౌక తూర్పు నౌకాదళ కమాండ్‌లో అంతర్భాగం కానుంది.తూర్పు కనుమలలోని ప్రసిద్ధ మహేంద్రగిరి పర్వత శ్రేణుల పేరును ఈ యుద్ధనౌకకు ఖరారు చేశారు. ముంబైలోని మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (MDL) ఈ నౌకను నిర్మించగా, భారత నౌకాదళానికి చెందిన వార్‌షిప్ డిజైన్ బ్యూరో దీనికి అత్యున్నత ప్రమాణాలతో రూపకల్పన చేసింది. "శక్తిమంతమైన, గంభీరమైన, సాటిలేనిది" అనే నినాదంతో ఈ నౌక సేవలు అందించనుంది.ప్రాజెక్ట్ 17A కార్యక్రమంలో భాగంగా మొత్తం ఏడు అత్యాధునిక స్టెల్త్ ఫ్రిగేట్‌లను సిద్ధం చేస్తున్నారు. ఇది దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన స్వదేశీ యుద్ధనౌకల నిర్మాణ ప్రాజెక్టులలో ఒకటి. ఈ శ్రేణిలో మహేంద్రగిరి ఆరవది కాగా, ఏడవ నౌక అయిన ఐఎన్ఎస్ వింధ్యగిరి కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ (GRSE) వద్ద ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది.ఐఎన్ఎస్ మహేంద్రగిరిలో 75 శాతానికి పైగా స్వదేశీ పరికరాలు, అత్యాధునిక సాంకేతికతను వినియోగించారు. ఇది కేంద్ర ప్రభుత్వ ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యానికి ప్రతిరూపంగా నిలుస్తోంది. శత్రువుల రాడార్లకు చిక్కని అత్యాధునిక స్టెల్త్ టెక్నాలజీతో పాటు బ్రహ్మోస్, బరాక్-8 వంటి శక్తిమంతమైన క్షిపణులు, జలాంతర్గామి విధ్వంసక వ్యవస్థలు ఇందులో కొలువుదీరాయి. ఈ యుద్ధనౌకల