
టెకీ రాధా గాయత్రి మృతికి సంబంధించి ఆమె తల్లిదండ్రులు సుధాకర్, సత్యవతి సంచలన ఆరోపణలు చేశారు. రాధా గాయత్రి మృతి చెందిన ముస్సోరి హోమ్‌స్టేను తల్లిదండ్రులు సందర్శించారు. విశాఖపట్నం, జులై 9: టెకీ రాధా గాయత్రి మృతికి సంబంధించి ఆమె తల్లిదండ్రులు సుధాకర్, సత్యవతి సంచలన ఆరోపణలు చేశారు. రాధా గాయత్రి మృతి చెందిన ముస్సోరి హోమ్‌స్టేను(కియనా హోటల్) తల్లిదండ్రులు సందర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఇక్కడ హోటల్ ఉన్న ప్రాంతం చూసి తామే భయపడ్డామని తెలిపారు. కూతురి మృతిపై సమగ్ర విచారణ జరిపి, త్వరితగతిన న్యాయం చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. హోమ్‌స్టే ప్రాంతంలో భద్రతా లోపాలు ఉన్నాయని, ఆ ప్రదేశం చాలా ఒంటరిగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అల్లుడు శ్రీచరణ్ ఇచ్చిన స్టేట్‌మెంట్లు అబద్ధమని, తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ఆరోపించారు. రాధా గాయత్రిని శ్రీచరణ్ హత్య చేశాడని పూర్తిగా నమ్ముతున్నామన్నారు. ఇది సాధారణ మరణం కాదని... అల్లుడితో పాటు అతని కుటుంబ సభ్యులపైనా తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. శ్రీచరణ్‌ను వెంటనే అరెస్ట్ చేసి, సమగ్ర విచారణ జరపాలని ఉత్తరాఖండ్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. న్యాయం కోసం ఏపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు, హోం శాఖలు సహకరిస్తాయని రాధా గాయత్రి తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేశారు. బస్ కోసం వేచి చూస్తున్న మహిళలపైకి దూసుకెళ్లిన బొలెరో స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్‌తో పూర్తి భరోసా.. కొరియా పెట్టుబడిదారులకు లోకేశ్ హామీ