
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Iran Closes Strait of Hormuz: ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం మరింత తీవ్రతరంగా మారుతోంది. తాము పేర్కొన్న మార్గాల్లో కాకుండా వేరే దారిలో వెళ్తున్న నౌకను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని ఇరాన్ ఇటీవలే స్పష్టతనిచ్చింది. అంతేకాకుండా, హార్ముజ్ జలసంధిని తాము పూర్తిగా మూసివేసినట్లు ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ ఘటన వల్ల అమెరికా తమపై దాడులు చేసే క్రమంలో పరిణామాలు అత్యంత తీవ్రంగా ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై కూడా దాడులు చేస్తామని ఇరాన్ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో అమెరికా సైనిక జోక్యం పూర్తిగా అంతమయ్యే వరకు హార్మజ్ జలసంధి మూసివేత కొనసాగుతుందని ఇరాన్ స్పష్టం చేసింది. దాడులు పెంచిన అమెరికా.. మరోవైపు, ఇరాన్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించడంతో అమెరికా పర్యవసానంగా భీకర దాడులను ప్రారంభించింది. నౌకలపై దాడులు చేయడం మరియు జలసంధి మూసివేత నిర్ణయం నేపథ్యంలో ఇరాన్ పై అమెరికా సైనిక చర్యలు చేపట్టింది. ఈ వారంలోనే ఇది మూడవ దాడి అని యుఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఖేష్మ్ ఐలాండ్, బందర్ అబ్బాస్, సిర్కిక్ వంటి ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించాయని ఇరాన్ లోని స్థానిక వార్తా సంస్థలు కూడా సమాచారాన్ని అందించాయి. ఈ ఉద్రిక్తతల వల్ల ఇరాన్ గల్ఫ్ దేశాలపై కూడా దాడులు చేసే అవకాశం ఉందని కనిపిస్తోంది, ఇరు దేశాల మధ్య పరస్పర విమర్శలు తీవ్రమవుతున్నాయి. ఇరాన్‌కు 24 గంటల గడువు.. ఈ ఉద్రిక్తతల మధ్య, నిన్న ఇరాన్‌కు అమెరికా 24 గంటల గడువు విధించిందని అంతర్జాతీయ