ధవళేశ్వరం బ్యారేజీకి మహర్దశ.. రూ.152 కోట్లతో ఆధునీకరణ.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
Actor ProfilePolitician

ధవళేశ్వరం బ్యారేజీకి మహర్దశ.. రూ.152 కోట్లతో ఆధునీకరణ.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ధవళేశ్వరం బ్యారేజీకి మహర్దశ.. రూ.152 కోట్లతో ఆధునీకరణ.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
10TV Telugu6 Nov 2026
ధవళేశ్వరం బ్యారేజీకి మహర్దశ.. రూ.152 కోట్లతో ఆధునీకరణ.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

రూ.152 కోట్ల భారీ నిధులు. బ్యారేజీ గేట్ల పూర్తి మార్పిడి. గోదావరి రైతులకు గొప్ప లాభం. Dowleswaram Barrage: గోదావరి డెల్టాకు జీవనాడిగా నిలిచిన ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ సమగ్ర మరమ్మత్తులు, ఆధునీకరణ పనులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా నిరంతర సేవల్లో ఉన్న ఈ కీలక ప్రాజెక్టు కోసం రూ.152.95 కోట్ల నిధులను మంజూరు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని పిచ్చుకలంక గేట్ నంబర్-1 వద్ద ఈ పనులకు అధికారికంగా శంకుస్థాపన చేయనున్నారు. Bihar News: ఊహించని ట్విస్ట్.. పెన్షన్ డబ్బుల కోసం వెళ్తే.. ఖాతాలో రూ.1500 కోట్లు ప్రత్యక్షం.. తరువాత ఏం జరిగిందో తెలుసా? చారిత్రక నేపథ్యం.. ప్రస్తుత అవసరం: 1852లో సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన పాత ఆనకట్ట (Dowleswaram Barrage)స్థానంలో, పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా 1984లో ప్రస్తుత ఆధునిక బ్యారేజీ నిర్మాణం పూర్తయింది. సుమారు 5.837 కిలోమీటర్ల పొడవున్న ఈ బ్యారేజీ ద్వారా 10.13 లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షలాది మందికి తాగునీరు అందుతోంది. అయితే, దశాబ్దాలుగా భారీ వరదల ఒత్తిడి, యాంత్రిక భాగాల అరుగుదల కారణంగా దీనికి ఆధునీకరణ అత్యవసరమని నిపుణుల కమిటీలు సూచించాయి. గతంలో 58 గేట్లను మార్చగా, ఇప్పుడు మిగిలిన 117 గేట్లను అత్యాధునిక సాంకేతికతతో భర్తీ చేయనున్నారు. రెండేళ్ల లక్ష్యం.. రైతులకు లబ్ధి: ఈ మెగా ప్రాజెక్టులో భాగంగా గేట్లకు కొత్త రబ్బర్ సీల్స్, రోలర్ అసెంబ్లీలు, వైర్ రోపులు, మాస్టర్ కంట్రోల్ ప్యానెల్స్ అమర్చడంతో పాటు శాండ్ బ్లాస్టింగ్, పెయింటింగ్ పనులు చేపట్టనున్నారు. హైదరాబాద్‌కు చెందిన బీఈకేఈఎం ఇన్‌ఫ్రా సంస్థ ఈ పనులను రెండేళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ఆధునీకరణతో బ్యారేజీ భద్రత పెరగడమే కాకుండా.. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ జిల్లాల రైతులు, మత్స్యకారులకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరనుంది