ధరణి ఐ లవ్ యూ’ షూటింగ్ పూర్తి
Actor ProfileActor

ధరణి ఐ లవ్ యూ’ షూటింగ్ పూర్తి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ధరణి ఐ లవ్ యూ’ షూటింగ్ పూర్తి
Chitrajyothy2 Jan 2027
ధరణి ఐ లవ్ యూ’ షూటింగ్ పూర్తి

వంశీ ఆకుల, మహిత జంటగా నటిస్తున్న ‘ధరణి ఐ లవ్ యూ’ సినిమా షూటింగ్ పూర్తయింది. హెచ్‌ఎస్‌పీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాజశేఖర్ మద్దికుంట నిర్మాత‌గా వంశీ ఆకుల, మహిత హీరో, హీరోయిన్లుగా రూపొందుతున్న కొత్త చిత్రం ‘ధరణి ఐ లవ్ యూ’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. గ‌తంలో ఎస్.ఎస్. రాజమౌళి, పరుచూరి మురళి, దేవిప్రసాద్ వంటి దర్శకుల వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన సాయి కృష్ణ కె.వి. ద‌ర్శ‌కుడిగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం సినిమాకు సంబంధించిన తదుపరి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. సాయి కృష్ణ కె.వి. గతంలో ‘అనగనగా ఒక ఊళ్ళో’ చిత్రానికి దర్శకత్వం వహించగా తాజాగా ‘ధరణి ఐ లవ్ యూ’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అయితే.. బొమ్మరాశిపేట, ఎల్లగూడ, ఉద్దమర్రి, లాల్గాడిమలక్‌పేట్, శామీర్‌పేట్, తూప్రాన్, వెంకటరత్నాపురం తదితర ప్రాంతాల్లోని సహజమైన అందమైన లొకేషన్లలో ఈ సినిమాను చిత్రీకరించారు. ప్రేమ, కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలకు ప్రాధాన్యతనిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా కథను రూపొందించినట్లు చిత్రబృందం తెలిపింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకుంటున్నాయి. త్వరలోనే ‘ధరణి ఐ లవ్ యూ’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఫస్ట్ లుక్‌తో పాటు సినిమా విడుదల తేదీకి సంబంధించిన వివరాలను కూడా త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలాఉంటే ..సినిమాలో ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ ఓ ప్రత్యేక సెంటిమెంట్ పాటను ఆలపించడం విశేషం. ఇంకా ఈ చిత్రంలో అర్పితా లోహి, ఆమని, వినోద్ కుమార్, మధుసూదన్, సత్య ప్రకాష్, దేవీ ప్రసాద్, అశోక్ కుమార్, బలగం సంజయ్, చిత్రం శ్రీను, షేకింగ్ శేషు, చిట్టిబాబు, రాజశేఖర్ మద్దికుంట, బాలసూర్య, పార్వతి, శకుంతలమ్మ, స్మృతి పాండే తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు