ధర్మస్థల నియోజకవర్గం’కు క్రిష్
Actor ProfileActor

ధర్మస్థల నియోజకవర్గం’కు క్రిష్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ధర్మస్థల నియోజకవర్గం’కు క్రిష్, చంద్రబోస్ సపోర్ట్.. ఏం చేశారంటే
Chitrajyothy30 Dec 2026
ధర్మస్థల నియోజకవర్గం’కు క్రిష్, చంద్రబోస్ సపోర్ట్.. ఏం చేశారంటే

‘ధర్మస్థల నియోజకవర్గం’కు డైరెక్టర్ క్రిష్, ఆస్కార్ విజేత చంద్రబోస్ సపోర్ట్ అందించారు. ఈ సినిమాలోని కీలకమైన పాటను వారు విడుదల చేసి, యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘ధర్మస్థల నియోజకవర్గం’ (Dharmasthala Niyojakavargam)కు డైరెక్టర్ క్రిష్ (Director Krish), ఆస్కార్ విజేత చంద్రబోస్ (Chandrabose) సపోర్ట్ అందించారు. మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సుమన్, సాయికుమార్, నటరాజ్, రాయంచ కొక్కుర, వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రలలో నటిస్తోన్న చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్ నిర్మిస్తోన్న ఈ పొలిటికల్ ఎంటర్‌టైనర్ చిత్రం.. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా ఈ మూవీ నుంచి ‘ధర్మో రక్షతి రక్షితః’ అంటూ సాగే పాటను దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్ర బోస్ సంయుక్తంగా.. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. సినిమా కథాంశానికి అనుగుణంగా రూపొందించిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందని, ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుతూ.. యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పాట విడుదల కార్యక్రమంలో చిత్ర దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట, చిత్ర నిర్మాత మేరుం భాస్కర్, సంగీత దర్శకుడు యేలెంధర్, సినిమాటోగ్రాఫర్ వెంకట్ హనుమలతో మరికొందరు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ పాట విడుదల సందర్భంగా చిత్ర దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట మాట్లాడుతూ.. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి చేతుల మీదుగా మా సినిమా పాట విడుదల కావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. అలాగే మా ప్రతి అడుగులోనూ ఆస్కార్ విజేత చంద్రబోస్.. మా వెన్నంటే ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు ఆయనకు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది