
వర్సటైల్ యాక్టర్ ధనుష్ హీరోగా, ‘అమరన్’ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామా ‘ఓమ్: చాప్టర్ 1’. ఈ మెగా ప్రాజెక్ట్‌కు సంబంధించి మేకర్స్ ఒక సాలిడ్ అప్‌డేట్‌ను పంచుకున్నారు. వర్సటైల్ యాక్టర్ ధనుష్ (Dhanush) హీరోగా, ‘అమరన్’ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periasamy) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామా ‘ఓమ్: చాప్టర్ 1’ (OM Chapter 1). ఈ మెగా ప్రాజెక్ట్‌కు సంబంధించి మేకర్స్ ఒక సాలిడ్ అప్‌డేట్‌ను పంచుకున్నారు. భారతీయ చలనచిత్ర రంగంలో తనదైన నటనతో చెరగని ముద్ర వేసిన సీనియర్ దిగ్గజ నటుడు నసీరుద్దీన్ షా (Naseeruddin Shah) ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఆయనకు స్వాగతం పలుకుతూ ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. కమల్ హాసన్ ‘హే రామ్’ (2000) చిత్రం తర్వాత దాదాపు 26 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం నసీరుద్దీన్ షా మళ్లీ ఓ తమిళ చిత్రంలో నటిస్తుండటం విశేషం. ‘ఓమ్’ ప్రపంచంలోకి ఆయన రాకతో సినిమా స్థాయి మరింత పెరిగిందని చిత్ర బృందం పేర్కొంది. ఇప్పటికే ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తుండగా, ఇప్పుడు నసీరుద్దీన్ షా కూడా తోడవడంతో ఈ క్రేజీ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రంలో ధనుష్ సరసన సాయి పల్లవి, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. వండర్‌బార్ ఫిల్మ్స్, ఆర్ టేక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎర్రచందనం కూలీల నేపథ్యంలో హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘ఓమ్: చాప్టర్ 1’ చిత్రాన్ని విజయదశమి కానుకగా 2026, అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీస్థాయిలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ మరోసారి స్పష్టం చేశారు. ఇది చాలు సార్.. కన్నీళ్లు తెప్పిస్తోన్న నిరంజన్