దేశ వ్యతిరేక శక్తులకు లొంగిపోయారు.. కేరళంలో వందేమాతరం ఆలపించకపోవడం
Actor ProfilePolitician

దేశ వ్యతిరేక శక్తులకు లొంగిపోయారు.. కేరళంలో వందేమాతరం ఆలపించకపోవడం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
దేశ వ్యతిరేక శక్తులకు లొంగిపోయారు.. కేరళంలో వందేమాతరం ఆలపించకపోవడంపై బీజేపీ ఆగ్రహం
Andhra Jyothy28 Dec 2026
దేశ వ్యతిరేక శక్తులకు లొంగిపోయారు.. కేరళంలో వందేమాతరం ఆలపించకపోవడంపై బీజేపీ ఆగ్రహం

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేరళంలో అధికారిక ప్రభుత్వ కార్యక్రమంలో వందేమాతరం ఆలపించకపోవడంపై రాజకీయ వివాదం చెలరేగింది. కేరళం ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా తప్పుపట్టింది. ఇంటర్నెట్ డెస్క్: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేరళంలో అధికారిక ప్రభుత్వ కార్యక్రమంలో వందేమాతరం ఆలపించకపోవడంపై రాజకీయ వివాదం చెలరేగింది. కేరళం ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా తప్పుపట్టింది. దేశ వ్యతిరేక, తీవ్రవాద శక్తుల ఒత్తిళ్లకు కేరళం ప్రభుత్వం లొంగిపోయిందని బీజేపీ ఆరోపించింది. ఈ అంశంపై న్యాయపరంగానూ, రాజకీయంగానూ పోరాడతామని పార్టీ ప్రకటించింది (Kerala Vande Mataram row). ఆగస్టు 15న తిరువనంతపురంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అయితే ఈ కార్యక్రమంలో వందేమాతరం ఆలపించలేదు. అదే సమయంలో కేరళం విద్యాశాఖ జారీ చేసిన మార్గదర్శకాల్లో పాఠశాలలు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ గీతం 'జనగణమన'ను ఆలపించాలని సూచించింది. అయితే వందేమాతరం ఆలపించడాన్ని తప్పనిసరి చేయలేదు. దీంతో ఈ నిర్ణయం రాజకీయ వివాదానికి దారితీసింది (Kerala Vande Mataram controversy). బీజేపీ నేత షోన్ జార్జ్ కేరళం ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు (BJP Kerala). ముఖ్యమంత్రి సతీశన్ నాయకత్వం గత ఏడాది కాలంగా జమాత్-ఇ-ఇస్లామీ, దేశ వ్యతిరేక శక్తులతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలు కొనసాగిస్తోందని ఆయన ఆరోపించారు. వందేమాతరం ఆలపించకపోవడం ఉద్దేశపూర్వక నిర్ణయమేనని, తీవ్రవాద శక్తుల డిమాండ్లకు ప్రభుత్వం తలొగ్గిందని ఆయన విమర్శించారు. ఈ వ్యవహారంలో అధికారులను కూడా బాధ్యులను చేస్తామని, అవసరమైతే కఠిన చర్యలు తీసుకునేందుకు తమ పార్టీ ముందుకు వెళ్తుందని హెచ్చరించారు. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే