
మరో వారం వచ్చేసింది. ఈసారి ఇండిపెండెన్స్ డే-వీకెండ్ కలిసొచ్చింది. దీంతో పలు తెలుగు సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. వాటిలో సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' స్పెషల్ అట్రాక్షన్ కాగా.. అగధ, పళ్లబురుసు


మరో వారం వచ్చేసింది. ఈసారి ఇండిపెండెన్స్ డే-వీకెండ్ కలిసొచ్చింది. దీంతో పలు తెలుగు సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. వాటిలో సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' స్పెషల్ అట్రాక్షన్ కాగా.. అగధ, పళ్లబురుసు

విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' సినిమాలో విలన్‌గా మెప్పించిన వెంకటేశ్ వీపీ.. స్వతహాగా మలయాళీ అయినప్పటికీ తొలి సినిమాతోనే తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు

ప్రేమకథలకు భాషతో సంబంధం లేదు. బాగుండాలే గానీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. అలా రీసెంట్ టైంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన హిందీ సినిమా 'మై వాపస్ ఆవుంగా'. జూన్‌లో థియేటర్లలో రిలీజైంది. ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నసీరుద్దీన్ షా, దిల్జిత్ దోసాంజ్, వేదాంగ్ రైనా, శార్వరి వాఘ్ ప్రధాన పాత్రధారులు. రెండు రోజుల క్రితం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇంతకీ ఇదెలా ఉంది? ఏడిపించేంతలా ఇందులో ఏముందనేది రివ్యూలో చూద్దాం. (ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ మిస్టరీ థ్రిల్లర్ 'ఉయిర్' తెలుగు రివ్యూ) కథేంటి? చంఢీగడ్‌లో ఉండే 95 ఏళ్ల కీను అలియాస్ ఇషార్ సింగ్ గ్రెవాల్ (నసీరుద్దీన్ షా) ఎలాగైనా సరే పాకిస్థాన్‌లోని సర్గోదా నగరానికి వెళ్లాలని పట్టుబడతుంటాడు. అదలా ఉండగానే స్ట్రోక్ వస్తుంది. దీనికి తోడు మెల్లమెల్లగా జ్ఞాపకశక్తిని కోల్పోతుంటాడు. చివరదశలో తాతకు తోడుగా ఉండేందుకు ఇంగ్లాండ్‌లో నుంచి మనవడు నిర్వార్(దిల్జీత్ దోసాంజ్)స్వదేశానికి తిరిగొస్తాడు. తాతతో మాట్లాడుతూ ఆయన గతం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఇంతకీ కీను.. పాక్ ఎందుకు వెళ్లాలనుకుంటున్నాడు? ఎవరిని కలవాలనుకుంటున్నాడు? అసలు 1947 దేశ విభజన టైంలో ఏం జరిగింది? అనేది అసలు స్టోరీ. ఎలా ఉందంటే? భారత్-పాక్ విడిపోయి 78 ఏళ్లు అయిపోయింది. అప్పుడేం జరిగిందో కళ్లారా చూసిన సరిహద్దు రాష్ట్రాల ప్రజలు ఇప్పుడు చాలావరకు జీవించిలేరు. ఇప్పటితరానికి ఆ సంగతులేవి పెద్దగా తెలీదు. చరిత్ర పుస్తకాల్లోని ఫొటోలుగా మాత్రమే చూశారు, చూస్తున్నారు. కానీ దేశవిభజన జరిగినప్పుడు నరకాన్ని అనుభవించిన ఆనాటి తరం పరిస్థితి ఏంటి? తమ సొంత ఇళ్లని, ప్రాణానికి ప్రాణమైన మనుషుల్ని వదిలేసి ఇక్కడికి వచ్చినవాళ్ల బాధేంటి? వారు తమ జీవితాంతం మోసిన ఆ గుండెకోత, గాయాల విలువెంత? అనేది ఓ ప్రేమకథతో చూపించిన సినిమానే 'మై వాపస్ ఆవుంగా'. సినిమా మొదలైన నిమిషాల్లోనే స్టోరీలోకి నేరుగా వెళ్లిపోతాం. 1947లో మన దేశంలోని పంజాబ్‌కి వలస వచ్చిన ఓ