దేశ భవిష్యత్తును మరింత గొప్పగా నిర్మించడమే మహనీయుల త్యాగాలకు నిజమైన నివాళి
Actor ProfilePolitician

దేశ భవిష్యత్తును మరింత గొప్పగా నిర్మించడమే మహనీయుల త్యాగాలకు నిజమైన నివాళి

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్
Andhra Jyothy22 Dec 2026
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్

హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గోల్కొండ కోటపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. హైదరాబాద్, ఆగస్టు 15: గోల్కొండ కోటలో 80వ

దేశ భవిష్యత్తును మరింత గొప్పగా నిర్మించడమే మహనీయుల త్యాగాలకు నిజమైన నివాళి
Andhra Jyothy21 Dec 2026
దేశ భవిష్యత్తును మరింత గొప్పగా నిర్మించడమే మహనీయుల త్యాగాలకు నిజమైన నివాళి

పంద్రాగస్టు నేపథ్యంలో తెలుగు వారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అమరావతి, ఆగస్టు15: పంద్రాగస్టు నేపథ్యంలో తెలుగు వారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలుగువారికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితమే మన స్వాతంత్ర్యం. వారి త్యాగాలకు నిజమైన నివాళి అంటే దేశ భవిష్యత్తును మరింత గొప్పగా నిర్మించడమే. అందుకు ‘అనే నేను..’ సంకల్పంతో దేశం నాకు ఏం చేసిందని కాదు.. దేశానికి నేను ఏం చేయగలనని అందరూ ఆలోచించాలి’. ‘మన చేతిలో జాతీయ జెండా ఉండాలి.. మన గుండెల్లో దేశం కోసం బలమైన అజెండా ఉండాలి. 2047 నాటికి వికసిత్ భారత్.. స్వర్ణాంధ్ర సాకారం చేయాలన్న సమున్నత లక్ష్యంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి. 100 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల నాటికి దేశం, రాష్ట్రం స్వాతంత్ర్యం నుంచి సమృద్ధి వైపు.. వికాసం నుంచి వైభవం వైపు ముందుకు సాగాలి. ఈ సంకల్పాన్ని నెరవేర్చుకునేందుకు ఐక్యంగా కలిసి అడుగులు వేద్దాం. జై తెలుగుతల్లి! జై హింద్!’ అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రతి హృదయం వందేమాతరం నినాదంతో మార్మోగుతోంది: ప్రధాని మోదీ