
యువ నటీనటులు ప్రధాన పాత్రలు పోషించిన 'అదే నీవు అదే నేను' చిత్రం టీజర్ ను దిల్ రాజు ఆవిష్కరించారు. కొండల్ దర్శకత్వంలో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ను కాండ్రేగుల గోవిందు నిర్మించారు. 'కమిటీ కుర్రోళ్లు' మూవీ ఫేమ్ త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, 'సిద్ధార్థ్ రాయ్' సినిమా ఫేమ్ తన్వీ నేగి హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా 'అదే నీవు అదే నేను'. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్ పై గోవిందు కాండ్రేగుల నిర్మిస్తున్నారు. రొమాంటిక్ థ్రిల్లర్ కథాంశంతో యువ దర్శకుడు కొండల్ రూపొందిస్తున్నారు. ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఈ టీజర్ రిలీజ్ సందర్భంగా డైరెక్టర్ కొండల్ మాట్లాడుతూ, 'మా సినిమా కథ గేటెడ్ కమ్యూనిటీ నేపథ్యంలో ఉంటుంది. ఇప్పటి యూత్ ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అవుతుంది. ప్రస్తుతం సొసైటీలో భార్యలు భర్తల్ని చంపిన క్రైమ్ న్యూస్ చూస్తున్నాం. అలాంటి తరహాలో సాగే రొమాంటిక్ థ్రిల్లర్ ఇది. మనం వేసే ఒక తప్పటడుగు, ఆవేశంలో చేసే నేరం జీవితాన్ని ఎలా తలకిందులు చేస్తుంది అనేది మా మూవీలో ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించాం. ప్రేక్షకుల ఊహకు అందకుండా మా సినిమా సాగుతుంది. సెకండాఫ్ లో ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ట్విస్ట్స్ ఉంటాయి. థియేటర్ లో మా సినిమా చూస్తున్నప్పుడు మీరు ఉలిక్కిపడటం ఖాయం. డీవోపీ జైపాల్ రెడ్డి అందించిన విజువల్స్, ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్, కనిష్క మ్యూజిక్ మా మూవీలో టెక్నికల్ గా హైలైట్ గా నిలుస్తాయి. దిల్ రాజు గారి చేతుల మీదుగా మా మూవీ టీజర్ లాంచ్ చేసినప్పుడు తన బ్యానర్‌లో చేస్తున్న సినిమాకు ఈ