ది రెడ్ బ్యాగ్’ విడుదలకు ముహూర్తం ఫిక్స్.. స్పెషల్ ఏంటంటే
Actor ProfileCelebrity

ది రెడ్ బ్యాగ్’ విడుదలకు ముహూర్తం ఫిక్స్.. స్పెషల్ ఏంటంటే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ది రెడ్ బ్యాగ్’ విడుదలకు ముహూర్తం ఫిక్స్.. స్పెషల్ ఏంటంటే
Chitrajyothy31 Dec 2026
ది రెడ్ బ్యాగ్’ విడుదలకు ముహూర్తం ఫిక్స్.. స్పెషల్ ఏంటంటే

మెమరీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సరికొత్త సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. ఈ మూవీ విడుదలకు డేట్ ఫిక్సయింది. మెమరీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సరికొత్త సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’ (The Red Bag). రవి కుమార్ సీరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కబీర్ సింగ్, ప్రముఖ కమెడియన్ ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, ఇంటెన్స్ గ్లింప్స్, టీజర్‌లు సినిమాపై సినీ ప్రియుల్లో భారీగా ఆసక్తిని, అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్ చేసిన పాటలు సైతం యూట్యూబ్‌లో విశేష ఆదరణ పొందుతూ ట్రెండింగ్‌గా నిలిచాయి. ఈ ఆసక్తికర చిత్ర విడుదలకు చిత్ర బృందం అధికారికంగా ముహూర్తం ఖరారు చేసింది. అన్ని హంగులూ పూర్తి చేసుకున్న ‘ది రెడ్ బ్యాగ్’ సినిమాను ఆగస్ట్ 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా విడుదలలో ఓ విశేషం ఉంది. దేశవ్యాప్తంగా ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలను, క్రేజీ ప్రాజెక్ట్‌లను పంపిణీ చేసి ఘన విజయాలు అందుకున్న దిగ్గజ సంస్థ ‘పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్’ (PVR INOX Pictures) వారు ఈ సినిమా హక్కులను దక్కించుకున్నారు. కంటెంట్ ఉన్న చిన్న చిత్రాలను ప్రోత్సహించే ఆ సంస్థ ఈ సినిమాపై పూర్తి నమ్మకంతో ముందుకు రావడం ప్రాజెక్ట్‌కు అతిపెద్ద బలంగా మారింది. ఆగస్ట్ 21న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన థియేటర్లలో పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ ఎత్తున విడుదల చేయబోతోంది. బలమైన కథ, ఆకట్టుకునే కథనంతో రూపొందిన