దీర్ఘకాలిక దృక్పథంతో ఆలోచించాలి
Actor ProfilePolitician

దీర్ఘకాలిక దృక్పథంతో ఆలోచించాలి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
దీర్ఘకాలిక దృక్పథంతో ఆలోచించాలి
Sakshi24 Jan 2027
దీర్ఘకాలిక దృక్పథంతో ఆలోచించాలి

న్యూఢిల్లీ: విధాన రూపకల్పనలో నూతన అంశాలను జోడించడానికి ప్రభుత్వ శాఖలు, విశ్వవిద్యాలయాలు, యువత మధ్య మరింత సమన్వయం ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యదర్శులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కృత్రిమ మేధ(ఏఐ)ను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని చెప్పారు. అదే సమయంలో మానవ మేధస్సు, విచక్షణను విస్మరించకూడదని అన్నారు. దేశ భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దాలనే దానిపై దీర్ఘకాలిక దృక్పథంతో ఆలోచించాలని కార్యదర్శులను కోరారు. డేటాను జాతీయ సంపదగా అభివర్ణించారు. వివిధ ప్రయోజనాల కోసం డేటాను సేకరించి, నిర్వహించే విధానాలలో తేడాలు ఉన్నాయని తెలిపారు. అలాగే, డేటా మధ్య మరింత అనుసంధానతను, దాని సమర్థవంతమైన వినియోగాన్ని సాధ్యం చేసే పరిష్కారాలను కనుగొనాలని సూచించారు. విడివిడిగా పనిచేయడం అనేది కేవలం సంస్థాగత సమస్య మాత్రమే కాదని, అది ఒక ఆలోచనా విధాన సమస్య అని అన్నారు. అధికారులు ఐకమత్య స్ఫూర్తితో పనిచేయాలని ప్రధాని స్పష్టం చేశారు. జట్టు స్ఫూర్తిని పెంపొందించుకోవడం వెనుక ఉన్న ప్రాముఖ్యతను వివరించారు. దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేయాల్సిన, ప్రపంచ స్థాయిలో దానిని మరింత పోటీతత్వంతో కూడినదిగా తీర్చిదిద్దాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. స్టన్నింగ్ లుక్‌లో అందాల తార పూజా హెగ్డే (ఫొటోలు) చీరలో మరింత అందంగా కనిపిస్తున్న ప్రియాంకా అరుళ్ మోహన్ (ఫొటోలు) చీరకట్టులో సొగసుల విందు.. నివేదా థామస్ (ఫొటోలు) విజయవాడ : వరలక్ష్మీ వ్రతం... పూల మర్కెట్‌లో విపరీతమైన రద్దీ (ఫొటోలు) రజినీకాంత్ ‘ధర్మన్’ సినిమాలో విలన్‌గా నటించనున్న రామ్ పోతినేని? జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ కూటమిపై సంచలన వ్యాఖ్యలు యువతిని కారుతో ఢీ కొట్టి చంపిన జనసేన MP కొడుకు అసలేం జరిగింది? ప్రియాంక తల్లిదండ్రుల మాటలు విని జగన్ కళ్లలో కన్నీళ్లు తిరిగాయి.. రిలీజ్ తరువాత జగన్ ను కలిసిన సీదిరి కుటుంబం