దంపతుల అదృశ్యం కేసులో అన్నీ అనుమానాలే
Actor ProfilePolitician

దంపతుల అదృశ్యం కేసులో అన్నీ అనుమానాలే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
దంపతుల అదృశ్యం కేసులో అన్నీ అనుమానాలే
Andhra Jyothy25 Oct 2026
దంపతుల అదృశ్యం కేసులో అన్నీ అనుమానాలే

స్విట్జర్లాండ్‌ వెళ్తున్నామని ఇంటి నుంచి బయలుదేరిన తమ తల్లిదండ్రుల ఆచూకీ లేకుండా పోయిందని ఓ యువతి చర్లపల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో అన్నీ అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. రూ.50 కోట్లతో ఉడాయించారని బాధితుల ఫిర్యాదు హైదరాబాద్: స్విట్జర్లాండ్‌ వెళ్తున్నామని ఇంటి నుంచి బయలుదేరిన తమ తల్లిదండ్రుల ఆచూకీ లేకుండా పోయిందని ఓ యువతి చర్లపల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో అన్నీ అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. ఆ దంపతుల బారిన పడి రూ.లక్షల్లో మోసపోయామని పలువురు వాపోతున్నారు. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. యాదాద్రి-భువనగిరి జిల్లా, తుర్కపల్లి మండలం మాదాపూర్‌ గ్రామానికి చెందిన పబ్బా చంద్రశేఖర్‌ (51) కుటుంబం 30 ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చింది. ముగ్గురు అన్నదమ్ములు కలిసి భగవాన్‌ కాలనీలో దాదాపు మూడు దశాబ్ధాలుగా నివసిస్తున్నారు. చంద్రశేఖర్‌ ఇటీవలే సొంత ఇల్లు కట్టుకొని భార్య స్వప్న(43), ఇద్దరు బిడ్డలు శ్రేయ(22), శ్రీనిత(19)లతో తన మకాంను అక్కడికి మార్చాడు. శ్రీ వెంకటేశ్వర మార్కెటింగ్‌ పేరిట హోల్‌సేల్‌ సిమెంట్‌(భారతి సిమెంట్స్‌) వ్యాపారం చేస్తూ, ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేషన్‌ (ఐవీఎఫ్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా చలామణీ అవుతూ పలువురితో సఖ్యత పెంచుకున్నాడు. ఆయన మాయమాటలను నమ్మి, వడ్డీ వస్తుందనే ఆశతో దాదాపు 80 మంది ఆయనకు రూ.లక్షల్లో అప్పులు ఇచ్చారు. అదృశ్యానికి ముందు చివరి ఇరవై రోజుల్లోనే దాదాపు రూ.40కోట్లు సేకరించినట్లు తెలుస్తోంది. గత నెల 22నుండి ఆయనతో పాటు ఆయన భార్య స్వప్న కూడా కనిపించకుండా పోవడం, చంద్రశేఖర్‌ ఫోన్‌ స్విచా్‌ఫలో ఉండడం, ఆయన ఇంటికి తాళం వేసి ఉండడం, ఇద్దరు కూతుళ్లను తన సోదరుడి వద్ద వదిలేసి వెళ్లడం వంటి విషయాలు తెలిసి బాధితులు భగవాన్‌ కాలనీలోని అతని ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేశారు. చివరకు తాము మోసపోయామని గుర్తించి స్థానిక పోలీసులను ఆశ్రయించారు. గత నెల 30వ తేదీన ఐవీఎఫ్‌ అధ్యక్షుడు వుప్పల శ్రీనివాస్‌