ది పాయింట్ ఆఫ్ వ్యూ' టీజర్ లాంచ్ ఈవెంట్
Actor ProfilePolitician

ది పాయింట్ ఆఫ్ వ్యూ' టీజర్ లాంచ్ ఈవెంట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ది పాయింట్ ఆఫ్ వ్యూ' టీజర్ లాంచ్ ఈవెంట్
Telugu Times3 Oct 2026
ది పాయింట్ ఆఫ్ వ్యూ' టీజర్ లాంచ్ ఈవెంట్

మహేష్ కాంపెల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వ్యూ: ది పాయింట్ ఆఫ్ వ్యూ' చిత్ర టీజర్‌ను చిత్రబృందం నేడు ఘనంగా విడుదల చేసింది. మిస్టరీ, సస్పెన్స్, ఎమోషనల్ అంశాలతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కార్తికేయ సమర్పణలో పరవాణి చలనచిత్ర బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం విభిన్నమైన కథనంతో తెరకెక్కుతోంది. "ది పాయింట్ ఆఫ్ వ్యూ" అనే ట్యాగ్‌లైన్‌నే కథలోని ప్రధాన అంశాన్ని ప్రతిబింబిస్తోంది. టీజర్ విడుదల సందర్భంగా హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ ఘనంగా మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా... నిర్మాత సత్య చౌదరి మాట్లాడుతూ.. "మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను వృత్తిరీత్యా కాంట్రాక్టర్‌ని. కానీ సినిమాలపై ఉన్న ఆసక్తితో ఈ రంగంలోకి వచ్చాను. దాదాపు పదేళ్ల క్రితం మహేష్ ఈ కథను నాకు వినిపించారు. ఒక మహిళా ప్రధాన కథతో మంచి సందేశాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని నిర్మించాను. నా తొలి నిర్మాణంతో ఇద్దరు తెలుగు హీరోయిన్లను పరిచయం చేయడం ఆనందంగా ఉంది. సినిమా రంగం నాకు కొత్త అయినప్పటికీ మహేష్ ప్రతి విషయంలో నాకు అండగా నిలిచారు. మా హీరోయిన్లు, సాంకేతిక నిపుణులందరికీ ధన్యవాదాలు" అన్నారు. హీరోయిన్ సోనియా నాయుడు మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. స్టేజ్‌పై మాట్లాడటం ఇదే మొదటిసారి. నాకు ఈ అవకాశం ఇచ్చిన సత్య గారికి, మహేష్ గారికి ధన్యవాదాలు. షూటింగ్ మొత్తం మహేష్ సర్ ఎంతో సపోర్టివ్‌గా ఉండేవారు. నా సహనటి పూజా రెడ్డి, సంగీత విభాగం, సినిమాటోగ్రఫీ టీమ్ అందరికీ ధన్యవాదాలు" అన్నారు. హీరోయిన్ పూజా రెడ్డి మాట్లాడుతూ.. "మా టీజర్ విడుదల కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. మహేష్ గారు కథ చెప్పిన వెంటనే ఇది నాకు మంచి అవకాశం అని భావించాను. ఈ సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు, నిర్మాతలకు ధన్యవాదాలు. మా టీజర్‌ను ఆదరించినట్లే సినిమా