దానికి దిక్కులేదు... వర్మ మరో సినిమా
Actor ProfilePolitician

దానికి దిక్కులేదు... వర్మ మరో సినిమా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
దానికి దిక్కులేదు... వర్మ మరో సినిమా
Chitrajyothy1 Dec 2026
దానికి దిక్కులేదు... వర్మ మరో సినిమా

'పోలీస్ స్టేషన్ మే భూత్' మూవీ విడుదల కావాల్సి ఉండగా, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నారు. 'పోలీస్‌ కంపెనీ' పేరుతో వర్మ తీయబోయే చిత్రాన్ని టి సీరిస్ సంస్థ నిర్మించబోతోంది. రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు తన నివాసాన్ని తిరిగి ముంబైకు మార్చాడని వార్తలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో జరిగిన కొన్ని పరిణామాలతో హైదరాబాద్‌ వదిలి వర్మ ముంబైకు వెళ్ళాడని అంటున్నారు. నిజానికి 'గోవిందా గోవింద' మూవీ తర్వాత తెలుగు సినిమా రంగంపై అలిగిన వర్మ ముంబైలోనే చాలా సంవత్సరాలు ఉన్నారు. ఏదో చుట్టపుచూపుగా హైదరాబాద్‌ వస్తుండేవారు. అయితే హిందీ చిత్రాలు సైతం పరాజయం పాలు కావడం, ఇతర కారణాలతో వర్మ తిరిగి హైదరాబాద్‌ వచ్చారు. వర్మ హైదరాబాద్‌ రావడం వెనుక అండర్ వరల్డ్ నుంచి వచ్చిన బెదిరింపులూ ఉన్నాయని కొందరు చెబుతుంటారు. అయితే... మళ్ళీ ముంబైకు చేరిన వర్మ ఇప్పుడు అక్కడో సినిమా తీయబోతున్నారు. అదే 'పోలీస్ కంపెనీ'. గతంలో వర్మ అండర్ వరల్డ్ మీద స్వీయ దర్శకత్వంలోనూ, నిర్మాతగానూ కొన్ని సినిమాలు తీశారు. అందులో 'సత్య', 'కంపెనీ' వర్మకు మేకర్ గా మంచి పేరు తెచ్చిపెట్టాయి. అలానే బెదిరింపులు వచ్చాయి. ఆ తర్వాత రూట్ మార్చిన వర్మ ముంబై పన్నెండేళ్ళ క్రితం 'అబ్ తక్ చెప్పన్' అనే సినిమాను నిర్మించారు. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా గుర్తింపు పొందిన సబ్ ఇన్ స్పెక్టర్ దయా నాయక్‌ జీవితంలోని సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. మళ్ళీ ఇంతకాలానికి వర్మ 'పోలీస్ కంపెనీ'ని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. దీనిని టీ. సీరిస్ సంస్థ నిర్మించబోతోంది. తెలుగులో పలు చిత్రాలలో నటించిన హర్షవర్థన్ రాణే ఈ మూవీలో దయానాయక్ పాత్ర పోషించబోతున్నాడు. 'పోలీస్‌ కంపెనీ' అనే టైటిల్‌ కు కొనసాగింపుగా 'ఇది డి-కంపెనీ కంటే చాలా ప్రమాదకరమైనది' అనే కాప్షన్ ను వర్మ పేర్కొన్నారు. వచ్చే నెలలో ఈ