దిండుతో అదిమి భర్త
Actor ProfilePolitician

దిండుతో అదిమి భర్త

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
దిండుతో అదిమి భర్త, కొడుకు హత్య
Sakshi9 Jan 2027
దిండుతో అదిమి భర్త, కొడుకు హత్య

సాక్షి, బెంగళూరు: దుర్మార్గురాలైన ఒక భార్య చేతిలో భర్త, ఒక చిన్నారి బలైపోయిన ఘటన సంచలనం రేపుతోంది. ప్రియుడితో కలిసి భర్తను, నాలుగేళ్ల కుమారుడి దారుణంగా హత్య చేసిన ఘటన కర్ణాటకలోని ఉత్తర బెంగళూరులోని చిక్కబానావర ప్రాంతంలో చోటుచేసుకుంది ఈ ఘటన. తండ్రీ కొడుకుల మరణంపై అనుమానం పోలీసులు ఆరా తీయగా హత్య కుట్ర కోణం వెలుగులోకి వచ్చింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం హరిణి అనే మహిళ ఈ ఘాతుకానికి పాల్పడింది. తన భర్త, కుమారుడు స్పందించడం లేదంటూ హరిణే స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించింది. అయితే ప్రేమికుడు వినయ్‌తో కలిసి భర్త అభినందన్‌ను హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. స్వల్ప విషయంలో దంపతుల మధ్య గొడవ జరగగా, హరిణి గరిటెతో అభినందన్‌పై దాడి చేసింది. ఆ తర్వాత ఎవరి గదుల్లో వాళ్లు నిద్రపోయారు. ఇదే అదనుగా భావించిన ఆమె వినయ్‌ను ఇంటికి పిలిపించి, ఇద్దరూ కలసి అభినందన్‌పై దాడి చేసి ఊపిరి ఆడకుండా చేసి చంసేశాడు. ఈ దాడి సమయంలో నిద్రలేచిన వారి కుమారుడు యదువీర్‌ను కూడా దిండుతో ఊపిరి ఆడకుండా చేసి మట్టుబెట్టారు. హరిణిని అదుపులోకి తీసుకుని విచారించగా మరిన్ని షాకింగ్‌ వివరాలు వెలుగుచూశాయి. అనుమానం రాకుండా ఉండేందుకు ఇంట్లోని రక్తం మరకలను శుభ్రం చేశారని పోలీసులు భావిస్తున్నారు. అంతేకాకుండా, వినయ్ ఇంటికి వచ్చిన సమయంలో సీసీటీవీ కెమెరాలను ఆపివేసి ఉంటారని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదీ చదవండి: ‘‘మా శవాలను తీసుకెళ్లండి’’ : భార్యాబిడ్డల్ని హతమార్చి, నావికుడు సూసైడ్‌ కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్న పోలీసులు పరారీలో ఉన్న ప్రియుడు వినయ్ కోసం కనకపుర సమీపంలోని హీరోహళ్లి ప్రాంతాల్లో గాలిస్తున్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం స్వగ్రామానికి తరలించారు. వినయ్‌ ఆచూకీ లభ్యమైన తరువాత అతని విచారించిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇదీ చదవండి: 14