
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Gold Rate Today: బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి బలపడటం, విలువైన లోహాలకు డిమాండ్ తగ్గడం వంటివి దేశీయ ధరలను తగ్గిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1.50 లక్షలకు పడిపోయింది. నిన్నటి ధర రూ. 1,50,650గా ఉండగా.. దానితో పోలిస్తే ఇది రూ. 1,400 తక్కువగా పలుకుతోంది. బంగారంతో పాటు, వెండి ధరలు కూడా కిలోగ్రాముకు రూ.200 తగ్గి రూ. 2,39,800కి చేరాయి. ఫెడరల్ రిజర్వ్ తన జూన్ మినిట్స్‌ను విడుదల చేయబోతుండటంతో, పెట్టుబడిదారులు లాభాలను స్వీకరించడానికి మొగ్గుచూపారని, దీనివల్ల ఉపసంహరణల కారణంగా బంగారం ధరలు భారీగా పడిపోయాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు, అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న రెండో విడత చర్చలు కూడా ఈ తగ్గుదలకు ఒక ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో, ఔన్సు బంగారం ధర 24.54డాలర్లు తగ్గి 4,140.59డాలర్లకు చేరుకుంది. వెండి ధర 2శాతం తగ్గి 60.89డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ లో సెప్టెంబర్ 4వ తేదీ ఎక్స్ పైరీ ఉన్న వెండి ధర రూ. 236,099కి పోయిన తర్వాత ప్రారంభంలోనే రూ. 230,803కి తగ్గింది. అంటే కిలో వెండి ధర రూ. 5,296 మేర తగ్గింది. గత రెండు రోజులుగా వెండి ధర తగ్గుతూ వస్తోంది. ఈ రెండు రోజుల్లో కిలోకు రూ. 6607 మేర తగ్గింది. వెండి ఇప్పుడు జీవితకాల గరిష్ట స్థాయితో చూస్తే రూ. 4.20లక్షలతో పోలిస్తే సగం ధరకే లభిస్తోంది. బంగారం ధర ఎంసీఎక్స్ లో తక్కువగా పలుకుతోంది