దిగ్గజ సెలబ్రిటీ ఇంటి నుంచి కొత్త హీరో
Actor ProfileActor

దిగ్గజ సెలబ్రిటీ ఇంటి నుంచి కొత్త హీరో

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
దిగ్గజ సెలబ్రిటీ ఇంటి నుంచి కొత్త హీరో
Sakshi27 Sept 2026
దిగ్గజ సెలబ్రిటీ ఇంటి నుంచి కొత్త హీరో

కోలీవుడ్‌లో మరో వారసుడి అరంగేట్రానికి సిద్ధమయ్యాడు. దివంగత మ్యూజిక్‌ కంపోజర్‌ ఆర్‌డి.భాస్కర్‌ వారసుడు జైయన్‌ హీరోగా పరిచయం అవుతున్నాడు. దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా సోదరుల్లో ఆర్‌డి భాస్కర్‌ ఒకరు. మ్యూజిక్‌ కంపోజర్‌గా పేరుగాంచిన ఈయన పలువురు సినీ ప్రముఖులతో కలిసి పనిచేశారు. తమిళ చిత్ర పరిశ్రమతో ఎంతో అనుబంధం కలిగిన ఈయన వారసుడు జైయన్‌. జైయన్‌ హీరోగా చేస్తున్న సినిమాకు 'రాజాస్ ప్లే లిస్ట్' అని ఇళయరాజాని గుర్తుచేసేలా టైటిల్ పెట్టారు. దీనికి యువన్‌ శంకర్‌ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. రమణన్‌ బాలగంగాధర్‌ నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. దర్శకుడు వెంకట్‌ ప్రభు కథ అందిస్తున్న ఈ చిత్రంతో సుజిత్‌ ఎన్‌.సుబ్రమణియమ్‌ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు. జైయన్‌కు జంటగా సోనా ఒలికల్‌ నటిస్తోంది. ఇతర పాత్రల్లో వాగై చంద్రశేఖర్‌, గురు సోమసుందరం తదితరులు కనిపించనున్నారు. షూటింగ్‌ చైన్నెలో ఆదివారం జరిగిన పూజ కార్యక్రమంతో ప్రారంభమైంది. ఇది మంచి మ్యూజికల్‌ డ్రామా చిత్రంగా ఉంటుందని నిర్మాత పేర్కొన్నారు. మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు. తిరుపతిలో ఘనంగా 'లెనిన్' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) తిరుమల శ్రీవారి సేవలో నాగార్జున కుటుంబం (ఫొటోలు) మాల్దీవులు ట్రిప్ వేసిన హీరోహీరోయిన్ జంట (ఫొటోలు) ఎన్టీఆర్ బావమరిది కొత్త సినిమా గ్రాండ్ లాంచ్ (ఫొటోలు) ఒకప్పటి హీరోయిన్ ఇప్పుడు షాకిచ్చేలా.. గుర్తుపట్టారా? (ఫొటోలు) చంద్రగిరిలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీవాళ్ళు బూతులు తిడితే కేసులు ఉండవా? ఉపా కేసు పెట్టాల్సింది పవన్ పైనే.. లైవ్ లో వీడియో చూపిస్తూ పవన్ కు రావణ్, జడ శ్రావణ్ అంటే ఎందుకంత భయం.. ఆకాశానికి చిల్లు పడిందా? ముంబైలో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ