
ఆర్ట్ ఇన్ హార్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై నివేద్య రెడ్డి నిర్మాణంలో డి.ఎస్. బాషా దర్శకత్వం వహించిన చిత్రం ‘ది ఇండియన్ బార్డర్’. ఈ మూవీ నుంచి దేశభక్తి గీతాన్ని మేకర్స్ విడుదల చేశారు. ఆర్ట్ ఇన్ హార్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై నివేద్య రెడ్డి నిర్మాణంలో డి.ఎస్. బాషా దర్శకత్వం వహించిన చిత్రం ‘ది ఇండియన్ బార్డర్’ (The Indian Border). ఈ సినిమాలో కిరణ్ యార్లగడ్డ, ఆదర్ష్, మురళీ మోహన్, మేఘా శ్రీ,, సిందు తులాని వంటివారు ముఖ్య పాత్రలను పోషించారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా శనివారం ఈ మూవీ నుంచి ఓ దేశభక్తి గీతాన్ని విడుదల చేశారు. ‘జిందా రహేన్ తో డ్యూటీ’ (Zinda Rahein Toh Duty) అంటూ సాగే ఈ పాట అడ్రినల్ రష్‌లా ఉంది. గూస్ బంప్స్ ఇచ్చేలా, నరనరాల్లో దేశభక్తిని రగిల్చేలా ఈ పాట సాగింది. ఈ పాటకు ఆనంద్ మంత్ర బాణీ, డి.ఎస్. బాషా సాహిత్యం, శరవణ గాత్రం దేశ భక్తి గీతంగా మార్చేసింది. జవాన్ల త్యాగాల్ని, ధైర్య సాహసాల్ని గుర్తు చేసేలా ఈ పాట సాగింది. కె మ్యూజిక్ ఈ మూవీ ఆడియో రైట్స్‌ను దక్కించుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో మేజర్ ఎస్‌పీఎస్ ఒబేరాయ్ మాట్లాడుతూ.. దేశం గురించి, సైన్యం గురించి ఇలాంటి గొప్ప సినిమా తీసినందుకు ఆనందంగా ఉంది. అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. బయటి ఆహారాన్ని తినొద్దు. నాకు సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదు. ఈ మూవీ మంచి విజయం సాధించాలని అన్నారు. హీరో, రైటర్ కిరణ్ యార్లగడ్డ మాట్లాడుతూ.. పాలస్తీనా వార్ టైంలో ఈ కథ నాలో పుట్టింది. డి.ఎస్. బాషా ఈ కథకు ఓ స్వరూపాన్ని తీసుకొచ్చారు. ఎక్స్ ఆర్మీ పర్సన్స్, మీడియా మాకు ఎంతగానో సపోర్ట్ చేసింది. సైనికుడు చేసే త్యాగం, సైనికుడి