థియేటర్లలో బ్లాక్ బస్టర్.. ఇప్పుడు ఓటీటీలో గుండెల్ని పిండేసే లవ్ స్టోరీ.. తెలుగుతో సహా 5 భాషల్లో
Actor ProfileActor

థియేటర్లలో బ్లాక్ బస్టర్.. ఇప్పుడు ఓటీటీలో గుండెల్ని పిండేసే లవ్ స్టోరీ.. తెలుగుతో సహా 5 భాషల్లో

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
థియేటర్లలో బ్లాక్ బస్టర్.. ఇప్పుడు ఓటీటీలో గుండెల్ని పిండేసే లవ్ స్టోరీ.. తెలుగుతో సహా 5 భాషల్లో
TV9 Telugu6 Jan 2027
థియేటర్లలో బ్లాక్ బస్టర్.. ఇప్పుడు ఓటీటీలో గుండెల్ని పిండేసే లవ్ స్టోరీ.. తెలుగుతో సహా 5 భాషల్లో

ఫస్ట్ లవ్‌ను సరికొత్తగా ఆవిష్కరిస్తూ, హృదయాన్ని హత్తుకునే కథనంతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ఈ రొమాంటిక్ డ్రామా ఆగ‌స్టు 21న సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. హృదయాన్ని హత్తుకునే కథనం, మనసుకు హాయినిచ్చే సంగీతం, ఆకట్టుకునే నటీనటుల పెర్ఫార్మెన్స్‌తో థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా రూ.60 కోట్లకు పైగా గ్రాస్‌ను సాధించింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. రవి నంబూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి రవి నంబూరి, సాయి రాజేష్ నీలం స్క్రీన్‌ప్లే అందించారు. సాయి రాజేష్ కథను అందించగా.. అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్లపై ఎస్‌కేఎన్, సాయి రాజేష్ నీలం ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ ప్రధాన పాత్రల్లో నటించారు. చెన్నై సిటీ బ్యాగ్రౌండ్‌లో రూపొందిన ఈ క‌మింగ్ ఆఫ్ ఏజ్ రొమాంటిక్ డ్రామా ఇద్దరు యువ హృదయాల చుట్టూ తిరుగుతుంది. ఫస్ట్ లవ్‌లోని ఉత్సాహం, అమాయకత్వం, ప్రేమలో ఎదురయ్యే బాధలను దాటుకుంటూ వారు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఈ క్రమంలో ఒకరినొకరు తెలుసుకోవడంతో పాటు.. ఎదిగే క్రమంలో తమను తాము తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యమని తెలుసుకుంటారు. ఓటీటీ ప్రీమియర్‌పై హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. “ఫస్ట్ లవ్‌తో ముడిపడిన అమాయకత్వం, ఉత్సాహం, భావోద్వేగాలను ఎంతో అందంగా చూపించిన సినిమా ‘చెన్నై లవ్ స్టోరీ’. అందుకే ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకమైనది. ప్రేక్షకులు సినిమాపై చూపించిన ప్రేమ, ఆదరణ మా అందరి జర్నీని ఎంతో మధురమైన జ్ఞాపకంగా మార్చాయి. ఇప్పుడు సోనీ లివ్ ద్వారా ఈ కథ వివిధ ప్రాంతాలు, భాషలకు చెందిన ప్రేక్షకుల ముందుకు డిజిటల్ ప్రీమియర్‌గా రాబోతుండటం ఎంతో ఆనందంగా ఉంది. సినిమాలోని పాత్రలకు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారని