థియేటర్లలో కన్నీళ్లు పెట్టిస్తున్న సూర్య.. విశ్వనాథ్ అండ్ సన్స్ పబ్లిక్ టాక్
Actor ProfileActor

థియేటర్లలో కన్నీళ్లు పెట్టిస్తున్న సూర్య.. విశ్వనాథ్ అండ్ సన్స్ పబ్లిక్ టాక్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
థియేటర్లలో కన్నీళ్లు పెట్టిస్తున్న సూర్య.. విశ్వనాథ్ అండ్ సన్స్ పబ్లిక్ టాక్
Asianet News Telugu19 Dec 2026
థియేటర్లలో కన్నీళ్లు పెట్టిస్తున్న సూర్య.. విశ్వనాథ్ అండ్ సన్స్ పబ్లిక్ టాక్

వర్సటైల్ యాక్టర్ సూర్య, గ్లామరస్ బ్యూటీ మమితా బైజు కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ 'విశ్వనాథ్ అండ్ సన్స్'. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈరోజే థియేటర్లలోకి అడుగుపెట్టింది. ఇక ప్రీమియర్స్, మార్నింగ్ షో చూసిన జనాలు ఎక్స్ (ట్విట్టర్) లో తమ రివ్యూలను షేర్ చేసుకుంటున్నారు. ఓవరాల్‌గా చూస్తే ఈ సినిమాకు ఎక్స్ లో పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. ఫ్యామిలీ డ్రామా, హార్ట్ టచింగ్ ఎమోషన్స్‌తో వెంకీ అట్లూరి మళ్లీ తన మార్క్ చూపించారని ఆడియన్స్ చెబుతున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా కూల్‌గా, ఫన్‌గా సాగిపోయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సినిమా స్టార్ట్ అయిన మొదటి 20 నిమిషాలు కథ కొంచెం స్లోగా స్టార్ట్ అయినా, ఆ తర్వాత మంచి పేస్ అందుకుంది. హాస్పిటల్ సీక్వెన్స్, ట్రిప్ కామెడీ, హోటల్ ఫైట్ సీన్లకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా ఇందులో సంజయ్ విశ్వనాథ్ పాత్రలో సూర్య ప్రాణం పోశారని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. గజినీలోని సంజయ్ రామస్వామి పాత్ర ఎంత ఐకానిక్‌గా ఉందో, ఈ సంజయ్ విశ్వనాథ్ రోల్ కూడా అంతే రేంజ్‌లో ఉందంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఆ పాత్రను సూర్య దాటేసారని కొంతమంది అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. రాధిక, మమితా బైజు, సూర్య మధ్య ఉన్న ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా నేచురల్‌గా వర్కవుట్ అయ్యాయి. మమితా బైజు లుక్స్ ఫ్రెష్‌గా, ఎనర్జిటిక్‌గా ఉండి క్యారెక్టర్‌కు పర్ఫెక్ట్‌గా సెట్ అయిందని చెబుతున్నారు. 'లక్కీ భాస్కర్' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత డైరెక్టర్ వెంకీ అట్లూరి మళ్లీ బలమైన కథతో వచ్చారని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. సెకండ్ హాఫ్‌లో ఫ్యామిలీ సెంటిమెంట్ పీక్స్‌లో ఉందని రివ్యూస్ వస్తున్నాయి. మన టాలీవుడ్ క్లాసిక్ హిట్స్ అయిన అలా వైకుంఠపురములో, అత్తారింటికి దారేది, బొమ్మరిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాల్లోని ఎమోషన్స్ ఈ సినిమాలో మళ్లీ చూశామని ఆడియన్స్ ఫీలవుతున్నారు. ఆ ఎమోషన్స్‌ను వెంకీ అట్లూరి తనదైన