తల్లిదండ్రులని చూసుకోవడం కంటే గొప్ప అదృష్టం లేదు
Actor ProfilePolitician

తల్లిదండ్రులని చూసుకోవడం కంటే గొప్ప అదృష్టం లేదు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తల్లిదండ్రులని చూసుకోవడం కంటే గొప్ప అదృష్టం లేదు
Sakshi30 Nov 2026
తల్లిదండ్రులని చూసుకోవడం కంటే గొప్ప అదృష్టం లేదు

తన తల్లిదండ్రులని తలుచుకుని హీరో నాగార్జున భావోద్వేగానికి లోనయ్యారు. ఈయన నిర్మించిన 'పళ్లబురుసు' అనే చిన్న సినిమా ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ కానుంది. దీని ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో సోమవారం సాయంత్రం జరిగింది. ఇందులోనే నాగ్ మాట్లాడుతూ ఎన్నడూ లేనంతలా ఎమోషనల్ అయ్యారు. తండ్రితో జ్ఞాపకాలని గుర్తుచేసుకున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలో ట్రెండింగ్ సినిమా.. త్వరలో మూడో పార్ట్?) 'నా తండ్రి ప్రారంభించిన ఈ సంస్థతో ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ ఏడాదిలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాం. అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్‌ని మరింత విస్తరించాం. నా తల్లిదండ్రులని ఎంతో ప్రేమగా, బాధ్యతగా చూసుకున్నాను. నా భార్య అమల కూడా అదృష్టవంతురాలు. ఎందుకంటే ఆమె కూడా తల్లిదండ్రులని ఎంతో శ్రద్ధగా చూసుకుంటోంది. తల్లిదండ్రులు మన కోసం చేసిన త్యాగాలని గుర్తించి వారికి అండగా నిలవడం మన జీవితంలో అత్యంత విలువైన బాధ్యత. తల్లిదండ్రులని ప్రేమగా చూసుకోవడం కంటే జీవితంలో గొప్ప అదృష్టం మరొకటి ఉండదు' అని నాగార్జున అన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి 50 ఏళ్లు పూర్తయింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెట్టారు. మొన్ననే కొడుకు అఖిల్‌తో తీసిన 'లెనిన్' సక్సెస్ అయింది. అలానే నాగ్ కూడా తన 100వ సినిమా చేస్తున్నారు. దీని షూటింగ్ కూడా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోంది. (ఇదీ చదవండి: ‘వారణాసి’లో హనుమంతుడిగా రామ్ చరణ్?) కొలంబియాను కుదిపేసిన రాకాసి భూకంపం..(ఫొటోలు) ‘అగధ’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ లో మెరిసిన నటి కామాక్షి భాస్కర్ల (ఫొటోలు) ‘పళ్ళ బురుసు’ ప్రీ-రిలీజ్ ప్రెస్ మీట్..ముఖ్య అతిథిగా నాగార్జున (ఫొటోలు) హైదరాబాద్‌ గచ్చిబౌలి లో సందడి చేసిన టాలీవుడ్ ముద్దుగుమ్మ మానస చౌదరి (ఫొటోలు) రోజుకు 3 గంటల క్లాసులు.. ఏడాదికి రూ.9 లక్షల ఫీజు.. అమెరికా ప్రీస్కూల్ వీడియో వైరల్ Big Question: ఆ నిందితులను 3 రోజులు ఎక్కడ దాచిపెట్టారు నన్ను