తమన్ గొప్ప మనసు
Actor ProfileActor

తమన్ గొప్ప మనసు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తమన్ గొప్ప మనసు
TeluguOne20 Jan 2027
తమన్ గొప్ప మనసు

తమన్.. సాంగ్స్ ,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొడితే ప్రేక్షకుడు తనకి తెలియకుండానే సీట్ లో నుంచి లేచి పూనకంతో డాన్స్ చేస్తాడు. హీరోకి గాని, ప్రతినాయకుడుకి గాని ఇచ్చే ఎలివేషన్ అయితే నభూతో నభవిష్యత్. కథ, కథనంకి తగ్గ మూడ్ తో బిజిఎమ్ ఇవ్వడంలో కూడా స్పెషలిస్ట్. తమన్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు 'సమాజంలో ఆదరణ కరువై అనాథలుగా మారుతున్న వృద్ధుల కోసం ఒక అత్యాధునిక ఓల్డ్ ఏజ్ హోమ్‌ నిర్మిస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ మొత్తం అంచనా వ్యయం 12 కోట్లు. ఇప్పటికే 4 కోట్లు ఖర్చు చేశాను. సినిమాల ద్వారా వచ్చే రెమ్యునరేషన్‌ మాత్రమే కాకుండా విదేశీ, స్వదేశీ మ్యూజిక్ కాన్సర్ట్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని సంపూర్ణంగా ఈ వృద్ధాశ్రమ నిర్మాణానికే కేటాయిస్తున్నానని చెప్పుకొచ్చాడు. చాలా మంది ఈ మంచి కార్యక్రమానికి విరాళాలు ఇస్తామని ముందుకు వచ్చినప్పటికీ, తమన్ ప్రేమగా తిరస్కరించడం విశేషం. సొంత కష్టార్జితంతోనే ఈ కలల ప్రాజెక్టును పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నారు. కేవలం వృద్ధాశ్రమమే కాకుండా, పేద విద్యార్థుల చదువులకు సహాయం చేయడం, అత్యవసర వైద్య శస్త్రచికిత్సలకు ఆర్థిక సాయం అందించడం వంటి ఎన్నో గుప్తదానాలను తమన్ ఏళ్ల తరబడి చేస్తున్నారు. ఈ సేవా కార్యక్రమాల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఒక టీమ్‌ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. రీల్ హీరోగానే కాకుండా రియల్ లైఫ్‌లోనూ తోటివారికి సహాయపడుతూ రియల్ హీరో అనిపించుకుంటున్న తమన్ మానవత్వానికి సినీ ప్రముఖులు మరియు అభిమానుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. కేవలం తన అద్భుతమైన మ్యూజిక్‌తోనే కాకుండా, తన ఉదార స్వభావంతో కూడా లక్షలాది మంది అభిమానుల హృదయాలని గెలుచుకుంటున్నారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ, ఎన్నో కష్టనష్టాల నడుమ గ్రౌండ్ లెవెల్ నుంచి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగిన ఆయన జీవిత ప్రయాణం అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. అయితే సమాజం నుంచి తాను