తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం.. మూడో కాన్పుకూ 365 రోజుల ప్రసూతి సెలవు
Actor ProfilePolitician

తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం.. మూడో కాన్పుకూ 365 రోజుల ప్రసూతి సెలవు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం.. మూడో కాన్పుకూ 365 రోజుల ప్రసూతి సెలవు
AP7AM13 Jan 2027
తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం.. మూడో కాన్పుకూ 365 రోజుల ప్రసూతి సెలవు

తమిళనాడు ప్రభుత్వం మహిళా ఉద్యోగుల సంక్షేమం దిశగా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు మూడో కాన్పు కోసం కూడా ప్రసూతి సెలవును 365 రోజులకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు మొదటి రెండు కాన్పులకు మాత్రమే ఏడాది పాటు సెలవు సౌకర్యం ఉండగా, ఇప్పుడు దానిని మూడో కాన్పుకు కూడా వర్తింపజేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం.. ఇద్దరి కంటే తక్కువ పిల్లలు ఉన్న మహిళా ఉద్యోగులకు 365 రోజుల ప్రసూతి సెలవు లభిస్తోంది. అయితే, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారికి (అంటే మూడో కాన్పు కోసం) కేవలం 12 వారాల సెలవు మాత్రమే ఇస్తున్నారు. ఈ విధానంలో మార్పు చేస్తూ, మూడో కాన్పుకు కూడా పూర్తిస్థాయిలో ఏడాది సెలవు మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.నిన్న‌ రాష్ట్ర అసెంబ్లీలో తన శాఖకు సంబంధించిన పద్దులపై జరిగిన చర్చలో మానవ వనరుల నిర్వహణ శాఖ మంత్రి డి. శరత్ కుమార్ ఈ ప్రకటన చేశారు. "తమిళనాడు ప్రభుత్వం సంక్షేమానికి, మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఈ నేపథ్యంలోనే మూడో కాన్పు కోసం మహిళా ఉద్యోగులకు ప్రస్తుతం అందిస్తున్న 12 వారాల సెలవును 365 రోజులకు పెంచుతున్నాము" అని ఆయన సభకు వివరించారు.తమిళనాడులో ప్రసూతి సెలవులను పెంచడం ఇదే మొదటిసారి కాదు. గతంలో 90 రోజులుగా ఉన్న ఈ సెలవును 2011లో ఆరు నెలలకు, 2016లో తొమ్మిది నెలలకు పెంచారు. అనంతరం 2021 జులైలో అప్పటి ప్రభుత్వం