తమిళనాడు సీఎం విజయ్ తో స్వాతంత్ర్య వేడుకల్లో త్రిష.. వైరల్ అవుతున్న ఫొటోలు
Actor ProfilePolitician

తమిళనాడు సీఎం విజయ్ తో స్వాతంత్ర్య వేడుకల్లో త్రిష.. వైరల్ అవుతున్న ఫొటోలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తమిళనాడు సీఎం విజయ్ తో స్వాతంత్ర్య వేడుకల్లో త్రిష.. వైరల్ అవుతున్న ఫొటోలు
Zee Telugu23 Dec 2026
తమిళనాడు సీఎం విజయ్ తో స్వాతంత్ర్య వేడుకల్లో త్రిష.. వైరల్ అవుతున్న ఫొటోలు

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Trisha Krishnan: తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు విజయ్ తొలిసారి సీఎం హోదాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. చెన్నైలోని ఫోర్ట్ సెయింట్ జార్జ్‌లో జరిగిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి, అనంతరం పరేడ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా విజయ్ సెల్యూట్ చేస్తూ, చిరునవ్వుతో అభివాదం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సీఎం హోదాలో ఆయన పాల్గొన్న తొలి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కావడంతో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. ఈ వేడుకలకు విజయ్ తల్లిదండ్రులు ఎస్.ఏ. చంద్రశేఖర్, శోభా చంద్రశేఖర్ కూడా హాజరయ్యారు. విజయ్ తండ్రి తెల్లటి దుస్తుల్లో కనిపించగా.. ఆయన తల్లి ఆకుపచ్చ చీరలో కనిపించారు. కుటుంబ సభ్యులు వేడుకల్లో పాల్గొన్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇక నటి త్రిష కృష్ణన్ కూడా తన తల్లి ఉమా కృష్ణన్‌తో కలిసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. చీరలో సంప్రదాయ లుక్‌లో కనిపించిన త్రిష ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒకవైపు విజయ్ సీఎం హోదాలో తొలి స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనడం, మరోవైపు త్రిష కూడా అదే కార్యక్రమానికి హాజరు కావడంతో వీరిద్దరి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. వేడుకల అనంతరం విజయ్ తమిళనాడు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. విజయ్, త్రిషకు దక్షిణాది సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ ఉంది. వీరిద్దరూ కలిసి గిల్లి, తిరుపాచ్చి, ఆతి, కురువి, లియో, ది గ్రేటెస్ట్ ఆఫ్