
ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలోని తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేవాదాయ శాఖలో ఓ నూతన కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో రూ. 10 లక్షలకు పైగా వార్షిక ఆదాయం ఉన్న ప్రముఖ దేవాలయాలకు వంశపారంపర్యేతర పాలక మండళ్లు, ధర్మకర్తలను ఎంపిక చేయడానికి ఉద్దేశించిన కమిటీ ఇది. ఆయా ఆలయాలన్నింటిల్లో ఇప్పుడున్న పాలకమండళ్ల పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వం ఈ కమిటీని తెరమీదికి తీసుకొచ్చింది.ఈ ఉన్నత స్థాయి కమిటీకి మైలం బొమ్మపురం మఠానికి చెందిన శివజ్ఞాన బాలాయ స్వామి ఛైర్మన్ గా వ్యవహరించనున్నారు. రిటైర్డ్ సెషన్స్ న్యాయమూర్తి డాక్టర్ కెే రామనాథన్ వైస్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ కమిటీలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు సభ్యులుగా స్థానం లభించింది. వారిలో ప్రముఖ పారిశ్రామికవేత్త, సినీ నిర్మత అర్చన కల్పాతి అఘోరం, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీఆర్ సంపత్, సుమతిశ్రీ, డాక్టర్ టీ వేల్ మురుగన్ ఉన్నారు.వీరితో పాటు దేవాదాయ శాఖ కమిషనర్ ఈ కమిటీకి కార్యదర్శిగా, ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉంటారు. ఆలయాల ధర్మకర్తల ఎంపిక ప్రక్రియ అత్యంత నిష్పక్షపాతంగా, సజావుగా సాగడానికి ఈ కమిటీ తగిన సూచనలు, సలహాలు ఇస్తుందని, అర్హులైన నాన్ హెరిడేటరీ పాలక మండళ్లు, సభ్యుల నియమాకాలకు అవసరమైన పేర్లను సిఫారసు చేస్తుందని దేవాదాయ శాఖ వెల్లడించింది.టాలీవుడ్ లో క్రేజీ ఫిల్మ్: పవర్ ఫుల్ టైటిల్: ఎప్పుడూ చేయని రోల్ లో యంగ్ హీరోఅలాగే దేవాదాయ చట్టం 1959 లోని సెక్షన్ 46 (3) నిబంధనల ప్రకారం అర్హులైన దరఖాస్తుదారులను ఈ కమిటీ పరిశీలిస్తుంది. వార్షిక ఆదాయం రూ. 10 లక్షల కంటే ఎక్కువగా ఉండే దేవాలయాలకు మాత్రమే ఈ వంశపారంపర్యేతర ధర్మకర్తల నియమకం వర్తిస్తుంది. దేవాలయాల నిర్వహణలో స్థానిక భక్తులు, నిష్ణాతులకు భాగస్వామ్యం కల్పించడం ద్వారా ఆలయాల పర్యవేక్షణను మరింత బలోపేతం చేయడమే ఈ కమిటీ ప్రధాన ఉద్దేశ్యం.అది మా రక్తంలోనే ఉంది: భరతమాత నొసటిన తిలకం: నిండు