
సూర్య ప్రకాష్ జోశ్యుల సినిమా మొదలైంది... థియేటర్‌లో లైట్లు ఆరిపోయాయి. తెరపై డ్రాగన్ ఎగురుతోంది. సముద్రం ఉప్పొంగుతోంది. ఒక కల్పిత ప్రపంచం ప్రేక్షకుడి కళ్ల ముందుకు వస్తోంది. జనం నిశ్శబ్దంగా చూస్తున్నారు. కానీ ఈ నిశ్శబ్దం వెనుక వారికి వినపడని ఓ పెద్ద శబ్దం మొదలైంది. ఇలాంటి రెండు గంటల మ్యాజిక్ వెనుక... వందల మంది యానిమేటర్లు...VFX నిపుణులు...కంప్యూటర్ గ్రాఫిక్స్ డిజైనర్లు...నెలలు... కొన్నిసార్లు ఏళ్ల తరబడి పనిచేస్తారు.అదే వారి జీవనాధారం. దాన్నే నమ్ముకుని ఉన్నారు. కానీ ఇప్పుడు అదే ప్రపంచాన్ని చాలా చిన్న టీమ్‌తోనే నిర్మించవచ్చని హాలీవుడ్‌లో కొందరు నిర్మాతలు,స్టూడియో అధినేతలు తేల్చి చెబుతున్నారు. అంతేకాదు... AI టూల్స్‌తో యానిమేషన్ సినిమా నిర్మాణ ఖర్చు 30% నుంచి 90% వరకు తగ్గే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. ఈ అంచనాలు ఇంకా మొత్తం పరిశ్రమలో రుజువు కాకపోయినా చాలా మందిలో గుబులు మొదలైంది. ఒకవేళ అవి నిజమైతే? సినిమాలు మాత్రమే కాదు... సినిమా తీసే విధానం కూడా మారిపోవచ్చు. AI వల్ల ముందుగా ప్రభావం పడే ఉద్యోగాలు ఇవే: 1. జూనియర్ VFX & రోటోస్కోపింగ్ ఆర్టిస్టులు (Rotosocoping & Matchmove) ఒక సీన్‌లో గ్రీన్ స్క్రీన్‌ను తీసేయాలన్నా, బ్యాక్‌గ్రౌండ్ మార్చాలన్నా ఇప్పటివరకు వందలాది మంది ఆర్టిస్టులు ఫ్రేమ్ బై ఫ్రేమ్ చేత్తో కట్ చేసేవారు (Rotoscopy). ఇప్పుడు AI టూల్స్ ఈ పనిని కేవలం కొన్ని సెకన్లలో, పర్‌ఫెక్ట్‌గా చేసేస్తున్నాయి. కాబట్టి ఎంట్రీ లెవెల్ VFX ఉద్యోగాలకు భారీగా కోత పడే ప్రమాదం ఉంది. 2. 3D మోడలర్స్ & క్యారెక్టర్ డిజైనర్లు (Character & Environment Designers) ఒక యానిమేషన్ సినిమాకు లేదా గ్రాఫిక్స్ సినిమాకు కావలసిన క్యారెక్టర్లు, బిల్డింగులు, బ్యాక్‌గ్రౌండ్ వాతావరణాన్ని స్క్రాచ్ నుండి డిజైన్ చేయడానికి నెలల సమయం పడుతుంది. కానీ ‘మిడ్‌జర్నీ’ (Midjourney), ‘స్టేబుల్ డిఫ్యూజన్’ లాంటి AI టూల్స్ కేవలం మనం ఇచ్చే కమాండ్స్