
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Ayodhya Ram Mandir Accounts: అయోధ్య రామ మందిరం విరాళాల చోరీ విషయమై దర్యాప్తు జరుగుతున్న వేళ నిన్న అయోధ్య రామ మందిరానికి సంబంధించి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సమావేశమైంది. అంతేకాదు అయోధ్య రామమందిరానికి దేశ వ్యాప్తంగానే కాకుండా విదేశాల నుండి కోట్లాది హిందువులు విరాళాలు, కానుకులు సమర్పించారు. దానికి సంబంధించిన పూర్తి లెక్కలను మీడియాకు వివరించారు. అయోధ్య రామ మందిరానికి సంబంధించి ఇప్పటి వరకు రూ. 3.264 కోట్ల విరాళాలులగా అందినట్టు ట్రస్ట్ పేర్కొంది. అందులో రూ. 2,370 కోట్లు ఆలయ నిర్మాణం, ప్రధాన పనులుపై ఖర్చు చేసినట్లు తెలిపింది. అయోధ్య భవ్య రామాలయం ఏర్పాటు అయిన తర్వాత 31 మార్చి 2026 వరకు హుండీ ఆదాయం 482 కోట్లు కానుకులు, డబ్బు రూపంలో వచ్చినట్టు తెలిపారు. వచ్చిన డబ్బులో రూ. 391 కోట్ల ఆలయానికి సంబంధించిన అందులో పనిచేసే వారికి జీత భత్యాలు వగైరా వంటి వాటికి ఖర్చుచేసినట్టు తెలిపారు. మిగిగిలన డబ్బులను అయోధ్య రామాలయానికి సంబంధించిన బ్యాంకు ఖాతాలో ఉన్నట్టు వెల్లడించారు. ఇప్పటి వరకు అయోధ్య బాల రాముడికి 2926 కానుకలు (భేటీలు) అందాయని తమ లెక్కల్లో తెలిపింది. ఆలయానికి వచ్చిన వెండి, బంగారాన్ని కరిగించి కడ్డీల రూపంలో భద్రపరిచినట్టు చెప్పారు. ఇక హుండీ నగదు చోరీ, నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో ట్రస్ట్ విడుదల చేసిన తొలి సమగ్ర ఆర్ధిక నివేదిక ఇదే కావడం గమనార్హం. అయోధ్య ఆలయానికి సంబంధించి ప్రభుత్వ