తొలి విజయం దక్కేనా
Actor ProfileActor

తొలి విజయం దక్కేనా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తొలి విజయం దక్కేనా
Sakshi30 Sept 2026
తొలి విజయం దక్కేనా

రాత్రి 10 గంటల నుంచి సోనీ స్పోర్ట్స్‌ చానెల్స్, జియో హాట్‌స్టార్‌ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం నాటింగ్‌హామ్‌: టి20 ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన తర్వాత భారత జట్టు మళ్లీ గెలుపు రుచి చూడలేకపోతోంది. ఐర్లాండ్‌ చేతిలో రెండు మ్యాచ్‌లలో ఓడి సిరీస్‌ కోల్పోయిన తర్వాత ఇంగ్లండ్‌తో గత మ్యాచ్‌లో పరాజయం పాలైంది. శ్రేయస్‌ అయ్యర్‌ ఇంకా కెప్టెన్‌గా గెలుపు ఖాతా తెరవలేదు. ఈ నేపథ్యంలో మరో పోరుకు భారత్‌ సిద్ధమైంది. నేడు ఇంగ్లండ్‌తో జరిగే మూడో టి20లోనైనా పైచేయి సాధించి ఈ టూర్‌లో తొలి విజయాన్ని అందుకోవాలని టీమిండియా భావిస్తోంది. భారత బ్యాటింగ్‌కు సంబంధించి మరోసారి అభిõÙక్‌ శర్మ ఇచ్చే ఆరంభం కీలకం కానుంది. అరంగేట్రంపై చర్చ ముగిసింది కాబట్టి ఇక వైభవ్‌ సూర్యవంశీ నుంచి అంచనాలకు తగినట్లుగా భారత్‌ ఒక చక్కటి ఇన్నింగ్స్‌ను ఆశిస్తోంది. ఇషాన్‌ కిషన్‌ తన వైఫల్యాల నుంచి బయటకు రావాల్సి ఉండగా... మిడిలార్డర్‌లో అయ్యర్, తిలక్‌ వర్మ, శివమ్‌ దూబే చెలరేగడం అవసరం. ముఖ్యంగా కెపె్టన్‌ అయ్యర్‌ ఇంకా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. బౌలింగ్‌ విషయంలో ఒక మార్పు ఖాయమైంది. గత మ్యాచ్‌లో చెత్త ప్రదర్శనలో భారత్‌ ఓటమికి కారణంగా నిలిచిన లెగ్‌స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ స్థానంలో మరో పేసర్‌కు అవకాశం ఇవ్వాలని మేనేజ్‌మెంట్‌ నిర్ణయించింది. కాబట్టి ప్రిన్స్‌ యాదవ్‌ తుది జట్టులో రావచ్చు. అర్‌‡్షదీప్‌ విఫలమైనా.. మరో తగిన ప్రత్యామ్నాయం జట్టుకు లేదు. స్పిన్నర్లు వరుణ్‌ చక్రవర్తి, అక్షర్‌ పటేల్‌ పరిస్థితిని బట్టి ప్రభావం చూపించగలరు. ఇంగ్లండ్‌ మాత్రం గత మ్యాచ్‌లో ఆడిన టీమ్‌లో ఎలాంటి మార్పూ చేయకుండా ఇప్పటికే తమ తుది జట్టును ప్రకటించింది. బ్యాటింగ్‌ భారం ప్రధానంగా కెపె్టన్‌ బ్రూక్, బెతెల్‌లపై ఉంది. రెండో టి20లో బెతెల్‌ జోరు చూస్తే అతడిని నిలువరించడం అంత సులువు కాదని అర్థమవుతోంది. అయితే గత పోరులో డకౌటైన ఓపెనర్లు సాల్ట్, బట్లర్‌ ఈ సారి ఎలాంటి ప్రభావితం